శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Updated :జె , సోమవారం, 19 ఆగస్టు 2019 (16:29 IST)

కృష్ణంరాజు ఎందుకలా అన్నారు.. ప్రభాస్ ఎందుకు కన్నీరు పెట్టుకున్నారంటే..?

"సాహో" సినిమా ఫ్రీరిలీజ్ ఫంక్షన్‌లో కృష్ణంరాజు ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాపై ఇప్పటికే జనంలో ఒక ఆతృత ఉంది. ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ సినిమా కోసం కేటాయించడం.. ఆ సినిమా విడుదల తేదీలను మారుస్తూ వచ్చినా ఆ తర్వాత ఆగస్టు నెలాఖరుకు కన్ఫామ్ చేసుకోవడం అభిమానులను సంతోషాన్ని నింపుతోంది.
 
ఇదిలావుంటే 'సాహో' సినిమాపై కృష్ణంరాజు మాట్లాడే సమయంలో ప్రభాస్ ఒక్కసారిగా ఏడ్చారు. మొదటి సాహో టీజర్‌ను విడుదల చేశారు. అప్పుడు నాకు చాలా ఫోన్లు వచ్చాయి. ప్రభాస్ ఇంకొద్దిసేపు కనిపించి ఉంటే బాగుండేదని అభిమానులు చెప్పారు. రెండోసారి పోస్టర్లు బయటకు వచ్చాయి. అవీ సూపర్ అన్నారు. ఇక చివరి టీజర్ అద్భుతమన్నారు. ప్రభాస్‌కు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. సినిమా ఆలస్యంగా తీసినా ఆ సినిమా భారీ విజయాన్నే సాధిస్తుంది.
 
ప్రభాస్ ఎప్పుడు ఏ సినిమాలో చేయాలన్నా ముందుగా రాజమౌళితో మాట్లాడారు. ఆయనకు కథను వినిపిస్తారు. ఆ కథ నచ్చతే వెంటనే సినిమాకు ఓకే అంటారు. మాకు రాజమౌళి కుటుంబానికి మధ్య అనుబంధం, ఆప్యాయత, స్నేహబంధం అలాంటిది అని చెబుతుండగా ప్రభాస్ కన్నీరు ఆపుకోలేక ఏడ్చేశారు.