గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2017 (10:19 IST)

దేశీ గర్ల్ రేటు రూ.5 కోట్లు

దేశీ గర్ల్‌గా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న భామ ప్రియాంకా చోప్రా. ఈమె రేంజ్ ప్రస్తుతం ఎక్కడికో వెళ్లిపోయింది. రెండేళ్లుగా బాలీవుడ్ వెండితెరపై కనిపించడం లేదు.

దేశీ గర్ల్‌గా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న భామ ప్రియాంకా చోప్రా. ఈమె రేంజ్ ప్రస్తుతం ఎక్కడికో వెళ్లిపోయింది. రెండేళ్లుగా బాలీవుడ్ వెండితెరపై కనిపించడం లేదు. పూర్తిగా హాలీవుడ్, ఇంటర్నేషనల్ అవార్డుల కార్యక్రమాల్లోనే కనిపిస్తోంది.
 
అయితే, రెండేళ్ల తర్వాత ఓ అవార్డుల ఫంక్షన్‌లో బాలీవుడ్ ట్యూన్స్‌కు స్టెప్పులేయనున్నది. ఇంతవరకు బాగానే ఉందిగానీ.. ఆమె ఇచ్చే ఐదు నిమిషాల పర్ఫార్మెన్స్‌కు రూ.4 నుంచి 5 కోట్లు డిమాండ్ చేసింది. ఆమె గ్లోబల్ ఇమేజ్, ఇంటర్నేషనల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ వల్ల ఈ అవార్డుల సెర్మనీ నిర్వహిస్తున్న జీ మీడియా.. ఆమె అడిగినంత ఇవ్వడానికి సై అన్నది.
 
దీంతో ఈ నెల 19వ తేదీన జరగబోయే జీ సినీ అవార్డ్స్‌లో ప్రియాంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టనుంది. ఇది కేవలం ఐదు నిమిషాల ప్రదర్శనే అయినా.. ఆమెకున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఆర్గనైజర్లు పెద్దగా బేరసారాలు లేకుండానే ఓకే చెప్పేశారని పీసీ సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. రెండేళ్ల తర్వాత ఇండియాలో పర్ఫార్మెన్స్ ఇవ్వనుండటంతో ఈవెంట్ మొత్తానికీ ప్రియాంకానే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నది.