ఎన్టీఆర్‌పై ప్రశంసలు.. నాకు ప్రేమ వివాహం ఆయన వల్లే జరిగింది..
ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె స్వప్నదత్ జూనియర్ ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించింది. తమ ప్రేమ పెళ్లి జరగడానికి జూనియర్ ఎన్టీఆరే కారణమని తెలిపింది.
ఎన్టీఆర్‌తో అశ్వనీదత్ 'శక్తి' సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ షూటింగ్ సమయంలో ప్రసాద్ వర్మతో తాను ప్రేమలో ఉన్నానని, ఆ విషయాన్ని తారక్‌తో చెప్పానని స్వప్నదత్ తెలిపారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పమని తారక్ తనకు సూచించాడని.. కానీ తమ ప్రేమను ఇంట్లో అంగీకరించే పరిస్థితి లేదన్నారు.
దీంతో, ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయకూడదని, అశ్వనీదత్ గారితో తాను మాట్లాడతానని తారక్ చెప్పారని... తన తండ్రితో మాట్లాడి ఒప్పించారని వెల్లడించారు. తారక్ వల్లే తన ప్రేమ వివాహం జరిగిందని చెప్పారు.