సోమవారం, 11 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2022 (17:53 IST)

కుమార్తెపై ఆకాశమంత ప్రేమ .. పాదాలకు పాలాభిషేకం

parents paada pooja
ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలపై అమితమైన ప్రేమను చూపిస్తుంటారు. అయితే, ఈ తల్లిదండ్రులు మాత్రం ఒక్క మెట్టు ఎక్కువే. తమ కుమార్తెపై ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదనీ, ఆకాశమంత అని నిరూపించేలా, కుమార్తె పాదాలను పాలతో కడిగారు. పుట్టుకతోనే తమకు అన్ని విధాలుగా కలిసివచ్చిందని భావించిన ఆ తల్లిదండ్రులు తమ కుమార్తెను కుర్చీలో కూర్చోబెట్టి ఈ పాలభిషేకం చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తమ కుమార్తెపై తమకున్న ప్రేమను వినూత్నంగా చూపించాలని భావించిన ఆ తల్లిదండ్రులు తమ కుమార్తెను కుర్చీలో కూర్చోబెట్టి పెద్ద స్టీల్ పాత్రలో ఆమె పాదాలు పెట్టారు. ఆమె పాదాలను తల్లిదండ్రులిద్దరూ పాలతో కడిగారు. ఒకరి తర్వాత ఒకరు ఒక తెలుగు రంగు టవన్‍‌తో తుడిచారు. ఆ తర్వాత పాదాలకు కుంకుమ పెట్టారు. ఆ తర్వాత ఆ పాలను కూడా తాగారు. 
 
అంతేకాకుండా, ఒక పాత్రలో కుంకుమ నీళ్లు పెట్టి, ఆమె పాదాలను ఆ నీళ్ళలో ముంచి తెలుగు రంగు టవల్‌పైన పెట్టేలా చూశారు. ఆ తెలుగు రంగు టవల్‌పై పడిన ఆమె పాద ముద్రలను తీసుకున్నారు. అలా తమ కుమార్తె పట్ల ఉన్న ప్రేమను వారు చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్  అయింది. అయితే, ఇది ఎక్కడ జరిగిందే తెలియదు.