తిరుమలలో భార్య, కుమారునితో దిల్ రాజు.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా, సక్సెస్‌ఫుల్ డిస్ట్రిబ్యూటర్‌గా పేరున్న దిల్ రాజు తిరుమల ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిన్న బడ్జెట్ సినిమాల నుంచి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే స్థాయికి ఇండస్ట్రీలో ఎదిగారు.
తాజాగా సినిమాల విషయానికొస్తే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక దిల్ రాజు వ్యక్తిత్వ జీవితం గురించి.. మొదటి భార్య అనిత 2017వ సంవత్సరంలో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.
అయితే ఈయన కూతురు హన్షిత రెడ్డి తన తండ్రి ఒంటరిగా ఉండడం చూడలేక తన సమీప బంధువు అమ్మాయి తేజస్విని తన తండ్రికి రెండవ వివాహం చేశారు. ఈ విధంగా తేజస్విని రెండవ వివాహం చేసుకున్న దిల్ రాజు తాజాగా జూన్ 29వ తేదీ దిల్ తేజస్విని పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. అయితే తనకు వారసుడు వచ్చాడంటూ దిల్ రాజు తన కొడుకుతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
తాజాగా దిల్ రాజు తన భార్య కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం బయటపడటంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.