శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 9 నవంబరు 2017 (10:36 IST)

#PSPK25 : ఓవర్‌నైట్‌లో మిలియన్ వ్యూస్ సొంతం (Audio Song)

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏపాటిదో మరోమారు నిరూపితమైంది. ఇటు సినిమాల్లోనేకాకుండా, అటు రాజకీయాల్లోనూ ఈ స్టార్ తనదైనశైలిలో రాణిస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, ప్రజా సమస్యలపై పవన్ స్పందిస్తున్నార

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏపాటిదో మరోమారు నిరూపితమైంది. ఇటు సినిమాల్లోనేకాకుండా, అటు రాజకీయాల్లోనూ ఈ స్టార్ తనదైనశైలిలో రాణిస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, ప్రజా సమస్యలపై పవన్ స్పందిస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు దిగివచ్చి ఆగమేఘాలపై పనులు చేస్తున్నాయి. ఈనేపథ్యంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న 25వ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. 
 
వచ్చే యేడాది జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో ఈ చిత్రంలోని "బయటకొచ్చి చూస్తే" అనే టైటిల్ సాంగ్‌ ఆడియోను చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేసింది. ఈ సాంగ్ రిలీజ్ జేసిన ఓవర్‌నైట్‌లోనే మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అనిరుద్ రవిచంద్రన్ సంగీత బాణీలు సమకూర్చిన ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది.