శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2017 (12:45 IST)

పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ స్నేహానికి అద్దం పట్టే ఫోటోలు.. బర్త్ డే స్పెషల్ (వీడియో)

నువ్వే నువ్వే సినిమా ద్వారా దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆపై.. అతడు, ఖలేజా, జల్సా, అత్తారింటికి దారేది, జులాయి, అ,ఆ, సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి సినిమాలకు దర్శకత్వం వహ

నువ్వే నువ్వే సినిమా ద్వారా దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆపై.. అతడు, ఖలేజా, జల్సా, అత్తారింటికి దారేది, జులాయి, అ,ఆ, సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ 28, పవన్ కల్యాణ్‌తో 25వ సినిమా చేస్తున్నారు. 
 
నవంబర్ 7న త్రివిక్రమ్ పుట్టినరోజు. టాలీవుడ్ అగ్ర దర్శకుల జాబితాలో పేరు సంపాదించిన మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్... యాక్షన్ ...ఎమోషన్‌ను కలిపిన వినోదాన్ని తెరపై పండించడంలో దిట్ట. తాజా చిత్రం పవన్ 'అజ్ఞాతవాసి' కూడా అదే తరహాలో రూపొందుతోంది.
 
త్రివిక్రమ్ పుట్టినరోజు.. ఈసారి తన ప్రాణ స్నేహితుడు పవన్ సినిమా సెట్స్‌పై ఉండగా రావడం విశేషం. పవన్ కల్యాణ్‌కి ఇది 25వ సినిమా కావడం. ఈ సినిమా షూటింగ్ సమయంలో త్రివిక్రమ్ పుట్టినరోజు రావడం యూనిట్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. 
 
దాంతో వాళ్లంతా కూడా త్రివిక్రమ్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకి సంబంధించిన స్పెషల్ ఫోటోలను రిలీజ్ చేశారు. వీటిలో.. సోఫాపై పవన్ పక్కనే కూర్చున్న ఆయన ఫోటో, వాళ్లిద్దరి స్నేహానికి అద్దం పడుతోంది. ఫోటోలు చూడండి.