బుధవారం, 15 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 జనవరి 2025 (22:00 IST)

Daku Maharaj: డాకు మహారాజ్‌ సినిమా చూసిన పురంధేశ్వరి ఫ్యామిలీ (video)

Purandeswari
Purandeswari
బాబీ దర్శకత్వం వహించిన నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైంది. తాజాగా ఈ సినిమాను రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు, ఆంధ్రప్రదేశ్ బిజెపి చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి చీరాలలో ఈ చిత్రాన్ని వీక్షించారు.
 
పురందేశ్వరి తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి చీరాల సందర్శించి స్థానిక మోహన్ థియేటర్‌లో డాకు మహారాజ్‌ను వీక్షించారు. ప్రదర్శన సమయంలో ఆమె పాప్ కార్న్ తింటూ సినిమాను ఆస్వాదిస్తూ కనిపించింది.
 
సినిమా తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ఈ చిత్రం బలమైన సామాజిక, నైతిక సందేశాలను అందిస్తుందని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. నందమూరి బాలకృష్ణ నటనను ఆమె ప్రశంసించారు. డాకు మహారాజ్ వెనుక ఉన్న మొత్తం బృందానికి ఆమె అభినందనలు తెలిపారు.