Sapthagiri: పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పురుష

దేవీ
సోమవారం, 20 ఏప్రియల్ 2026 (17:02 IST)
Pawan Kalyan Bathula, Saptagiri, Kasireddy Rajkumar
బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బత్తుల తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీకి వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బత్తుల, సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్, అనంత్ శ్రీరామ్, వెన్నెల కిషోర్ పాత్రలు హైలెట్ కానున్నాయని సమాచారం. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్ అన్నీ కూడా  సినిమాపై ఆసక్తి కలిిగించాయి.
 
అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన కంటెంట్ ట్రేడ్ వర్గాల్లో హైప్‌ను క్రియేట్ చేసింది. పాటలు అయితే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. సమ్మర్ కానుకగా ఈ సినిమాని మే నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్స్ చేస్తున్నారు. 
 
ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ కామెడీ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ‘పురుష:’ రూపొందుతోంది. ఈ మూవీకి శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. సతీష్ ముత్యాల కెమెరామెన్‌గా, కోటి ఎడిటర్‌గా పని చేస్తున్నారు.
 
నటీనటులు :  పవన్ కళ్యాణ్ బత్తుల, సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్, అనంత్ శ్రీరామ్, వెన్నెల కిషోర్ తదితరులు

అన్నీ చూడండి

జగన్ బహిరంగ సభలకు అనుమతి ఎందుకివ్వలేదు.. పవనే చెప్పాలి: రేవంతన్న

ఏపీ సీఎం చంద్రబాబు వీడియో కాల్ చేశారు.. రూ.80వేలు పంపిన వ్యక్తి.. అంతా మోసం (video)

ఇది మన కోనసీమే.. కేరళ మున్నార్ కాదు... శెభాష్ పవన్ (వీడియో)

ప్రేమించి పెళ్లి చేసుకుందని కన్నతండ్రే కుమార్తెను కడతేర్చాడు.. అందరూ చూస్తుండగా..?

భారీ వర్షాలు కురుస్తున్నాయ్.. అప్రమత్తంగా ఉండండి : సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

యూరిక్ యాసిడ్: తగ్గించుకునే మార్గాలు

కేన్సర్‌ను నిరోధించే మామిడి పండ్లు, ఎలాగ?

వామ్మో.. పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్ ... వైద్యులేమంటున్నారు...

పనస విత్తనాలులో దాగి వున్న ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

గుండె జబ్బులను నిరోధించే వెల్లుల్లి చట్నీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments