శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (10:20 IST)

ఓటిటి బిగ్ బాస్‌లోకి పుష్ప కేశవ: భారీ రెమ్యూనరేషన్‌ ఆఫర్

Keshava
డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన మూడో సినిమా పుష్ప ప్రస్తుతం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అల్లు అర్జున్ కెరీర్‌లో ఈ సినిమా మంచి గుర్తింపును సంపాదించి పెట్టింది. 
 
పుష్పలో అల్లు అర్జున్ చిత్తూరు యాసలో, గంధపు చెక్కల స్మగ్లర్ పాత్రలో ఒదిగిపోయాడు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ పక్కనే క్యారెక్టర్ కేశవ ఇప్పుడు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు దక్కింది. అంత మాత్రమే కాకుండా కేశవ ఇప్పటికే జబర్దస్త్ వంటి షోలో అలరిస్తున్న సంగతి తెలిసిందే. 
 
హైపర్ ఆది టీంలో ఇటీవల వచ్చి జబర్దస్త్ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో నిర్వాహకులు… కేశవకి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి.. ఓటిటి బిగ్ బాస్‌లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 
 
ఇప్పటికే మనోడు రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి పాపులారిటీ సంపాదించడంతో.. ఓటిటి బిగ్ బాస్‌లోకి.. తీసుకోవడానికి బిగ్ బాస్ షో యాజమాన్యం ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు టాక్.