శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 11 మార్చి 2017 (09:51 IST)

మధ్యాహ్నం 12 గంటలకు నా ఫేస్‌బుక్ పేజీని మిస్ కావొద్దు: రాజమౌళి

తెలుగు సినిమా చరిత్రలో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌గా పేరొందిన బాహుబలి 2 సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రెండు పార్టులు కలిసి రూ. 200 నుండి 250 కోట్లలో సినిమాను పూర్తి చేయాలనే

తెలుగు సినిమా చరిత్రలో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌గా పేరొందిన బాహుబలి 2 సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రెండు పార్టులు కలిసి రూ. 200 నుండి 250 కోట్లలో సినిమాను పూర్తి చేయాలనే అంచనాతో ప్రారంభించారు. 'బాహుబలి-ది బిగినింగ్' ఊహించిన దానికంటే భారీ విజయం సాధించింది. ఈ చిత్రం దాదాపు 650 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. 
 
మొదటి భాగం భారీ విజయం సాధించడం, భారీ వసూళ్లు రాబట్టడంతో రెండో భాగం 'బాహుబలి-ది కన్‌క్లూజన్' పై నిర్మాతలు ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే ఖర్చు పెట్టారని తెలుస్తోంది. ప్రీ రిలీజ్‌లోనే బాహుబలి 2 బాగా సంపాదించేసిందని టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. తాజాగా శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బాహుబలి ఫేస్ బుక్ పేజీని మిస్ కావద్దని దర్శక దిగ్గజం రాజమౌళి పిలుపునిచ్చారు. ఈ మేరకు 'బాహుబలి' అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును ఉంచారు. 
 
'బాహుబలి: ది కన్ క్లూజన్'పై లైవ్ ఉంటుందన్నారు. కాగా, ఈ లైవ్ లో ఆయన స్వయంగా పాల్గొని అభిమానులు అడిగే ప్రశ్నలకు స్వయంగా సమాధానాలు ఇస్తారని తెలుస్తోంది. ఫేస్ బుక్ లో 'baahubalimovie' ద్వారా ఈ లైవ్ ను వీక్షించవచ్చని రాజమౌళి తెలిపారు.