మంగళవారం, 29 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 ఏప్రియల్ 2025 (09:13 IST)

వరుసగా అలాంటి పాత్రలు రావడానికి కారణం ప్లస్ సైజులో ఉండటమే : అశ్రిత వేమగంటి

ashrita vemuganti
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం 'బాహుబలి'. ఇందులో హీరోయిన్ అనుష్కకు వదిన పాత్రలో ఆశ్రిత వేమగంటి నటించారు. ఈ చిత్రం తర్వాత ఆమె సినీ కెరీర్ మారిపోయింది. వరుస చిత్రాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. అయితే, 'బాహుబలి' తర్వాత పలు చిత్రాల్లోనూ ఆమె పెద్ద తరహా పాత్రలోనే నటిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
తన డ్యాన్స్ చూసిన రాజమౌళి తనకు 'బాహుబలి' చిత్రంలో నటించే అవకాశం ఇచ్చారని, ఆ సినిమా నిర్మాణ సమయంలో తన వయసు కేవలం 27 యేళ్ళు మాత్రమేనని, అందులో తనను దర్శకుడు రాజమౌళి చాలా పెద్దదానిలాగా చూపించారని అన్నారు. తాను ప్లస్ సైజులో ఉండటంతో అలా సులువుగా కనిపించేశానని చెప్పారు. రాజమౌళి విజన్ చాలా బాగుటుందని అన్నారు. పైగా, ఆయన వల్లే తనకు చాలా మంచి పేరు వచ్చిందన్నారు. 
 
'బాహుబలి' చిత్రం తర్వాత కూడా తనకు అలాంటి పాత్రలో ఎక్కువగా వచ్చాయన్నారు. తాను ప్లస్ సైజలో ఉండటమే ఇందుకు కారణమైందన్నారు. తన వయసు తక్కువే అయినప్పటికీ పెద్ద వయసు పాత్రల్లో నటించాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. తన కంటే ఎక్కువ వయసున్న వారే అదే చిత్రంలో చిన్న వయసు పాత్రల్లో నటించారని ఆమె చెప్పుకొచ్చారు.