సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (15:32 IST)

నల్గొండ ఈగల్స్ టీమ్‌‌కు మెంటర్‌గా దర్శకధీరుడు

తెలుగు రాష్ట్రాల్లో కబడ్డీకి ఆదరణ పెరుగుతోంది. ఈ క్రీడకు సెలెబ్రిటీల ఆదరణ కూడా బాగానే లభిస్తోంది. కబడ్డీని ప్రోత్సహించేందుకు వారు ముందుకొస్తున్నారు. తాజాగా దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తీకేయ, నిర్మాత

తెలుగు రాష్ట్రాల్లో కబడ్డీకి ఆదరణ పెరుగుతోంది. ఈ క్రీడకు సెలెబ్రిటీల ఆదరణ కూడా బాగానే లభిస్తోంది. కబడ్డీని ప్రోత్సహించేందుకు వారు ముందుకొస్తున్నారు. తాజాగా దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తీకేయ, నిర్మాత సాయి కొర్రపాటితో కలిసి తెలంగాణ ప్రీమియర్ కబడ్డీలో నల్గొండ ఈగల్స్ టీమ్‌ను ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ జట్టుకు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. 
 
ఈ విషయాన్ని రాజమౌళినే స్వయంగా సోషల్ మీడియాలో ద్వారా తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ మొదలుకానుంది. ఈ టోర్నీలో రాజమౌళి కుమారుడు కార్తీకేయ నల్గొండ ఈగల్స్ టీమ్‌కు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ జట్టుకు మెంటర్‌గా పనిచేయనున్నానని రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలిపారు. 
 
ఇప్పటికే రాజమౌళికి క్రీడలంటే ఇష్టం. క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే రాజమౌళి.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ జట్టుకు జక్కన్న మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇదే బాటలో రాజమౌళి తనయుడు కబడ్డీ టీమ్‌ను ప్రజెంట్ చేస్తున్నాడు.