గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: గురువారం, 16 ఆగస్టు 2018 (20:46 IST)

నీ నుంచి ఇది ఊహించలేదు విజయ్ : రాజమౌళి ట్వీట్స్

అర్జున్‌ రెడ్డి సినిమాతో ఓ ట్రెండ్ సెట్ చేసాడు విజయ్‌ దేవరకొండ. తన ఇమేజ్‌కు దూరంగా జరిగి చేసిన సినిమా ‘గీత గోవిందం’ మంచి టాక్ సంపాదించింది. అందరి మన్ననలను పొందింది. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి విజయ్ దేవరకొండ నటనపై ట్వీట్‌ చేశారు. నీ నుంచి ఇది అస్సలు

అర్జున్‌ రెడ్డి సినిమాతో ఓ ట్రెండ్ సెట్ చేసాడు విజయ్‌ దేవరకొండ. తన ఇమేజ్‌కు దూరంగా జరిగి చేసిన సినిమా ‘గీత గోవిందం’ మంచి టాక్ సంపాదించింది. అందరి మన్ననలను పొందింది. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి విజయ్ దేవరకొండ నటనపై  ట్వీట్‌ చేశారు. నీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు విజయ్. 
 
అర్జున్‌ రెడ్డి వంటి సినిమా తర్వాత ఇది నీ బెస్ట్‌ చాయిస్‌. ‘‘గీత గోవిందం’  సినిమా చూసి చాలా నవ్వుకున్నాను. అంటూ ట్వీట్ చేసాడు. అంతేకాదు  తానేం చేస్తున్నాడో విజయ్‌కు బాగా తెలుసు. సినిమా అంతా సరదా సన్నివేశాలతో నింపేశారు. సినిమాను చాలా బాగా తెరకెక్కించావు పరశురాం..’  అంటూ గీత గోవిందం టీమ్‌పై ప్రశంసలు కురిపించాడు రాజమౌళి.