సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: గురువారం, 16 ఆగస్టు 2018 (14:28 IST)

గీత గోవిందంలో ఆ సీన్లు.. క్యూ కడుతున్న అమ్మాయిలు..?

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా అల్లు అరవింద్ సమర్పణలో పరశురాం తెరకెక్కించిన చిత్రం గీత గోవిందం. భారీ అంచనాల మధ్య స్వాతంత్ర్య దినోత్సవం రోజు సినిమా విడుదలైంది. గీత గోవిందం యూత్ ఫిల్మ్. కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. వారి మధ్య వచ్చిన సన్నివేశాలు చాలా బాగున్న

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా అల్లు అరవింద్ సమర్పణలో పరశురాం తెరకెక్కించిన చిత్రం గీత గోవిందం. భారీ అంచనాల మధ్య స్వాతంత్ర్య దినోత్సవం రోజు సినిమా విడుదలైంది. గీత గోవిందం యూత్ ఫిల్మ్. కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. వారి మధ్య వచ్చిన సన్నివేశాలు చాలా బాగున్నాయి. పాటలు కూడా వినసొంపుగా వున్నాయి. కథ అంతంతమాత్రంగా ఉంటే స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉన్నదట. 
 
తన స్టైల్‌తో అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ ఫస్టాఫ్‌లో అదరగొట్టాడు. సెకండ్ ఆఫ్‌లో మెల్లగా సినిమా నడుస్తుంది. కాలేజ్ లెక్చరర్‌గా కనిపించాడు. సినిమా మొత్తం విజయ్ క్యారెక్టర్ పైనే ఎక్కువగా తిరుగుతుంటుంది. ఇందులో ఎవరూ ఊహించని విధంగా నిత్యా మీనన్, అను ఇమ్మానుయేల్ క్యారెక్టర్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాంకేతిక వర్గం పనితీరు కూడా అద్భుతంగా ఉంది. 
 
ఇంకేం కావాలి పాట అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంతేకాదు అర్జున్ రెడ్డి తరహాలో ఇందులో ముద్దుల సీన్లు హైలెట్ అంటున్నారు. అంతేకాదట... బెడ్ సీన్ కూడా కాసేపు ఉందట. దీంతో యూత్ ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేసేస్తున్నారట. అమ్మాయిలైతే టిక్కెట్ల కోసం థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారట.