శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 3 ఫిబ్రవరి 2018 (18:27 IST)

చదువులమ్మకి కన్నీటి వీడ్కోలు : లక్ష్మీదేవి మృతిపై చిరంజీవి

ప్రముఖ నటుడు రాజీవ్‌ కనకాల కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీదేవి(78) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం స్వగృహంలో తుది శ్వాస విడిచారు.

ప్రముఖ నటుడు రాజీవ్‌ కనకాల కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీదేవి(78) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం స్వగృహంలో తుది శ్వాస విడిచారు. లక్ష్మీదేవి భర్త దేవదాస్‌ కనకాల కూడా నటుడు అన్న విషయం తెలిసిందే. కనకాల కుటుంబానికి మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ ప్రగాఢ సంతాపం తెలియజేసింది. ఈ మేరకు మా అధ్యక్షుడు శివాజీరాజా, కార్యదర్శి నరేష్‌లు ఓ ప్రకటన విడుదల చేశారు.
 
అలాగే, మెగాస్టార్ చిరంజీవి కూడా తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా ఆయన పేర్కొన్నారు. 'పేరు లక్ష్మీదేవి అయినా ఆమె నా పాలిట సరస్వతీ దేవి. ఆమె పాఠాలే నా పాఠవాలకి మూలం. నటనలో ఆమె నేర్పిన మెళకువలే నాలోని నటుడికి మెలుకువలు. లక్షలాది కుటుంబాలకి అభిమాన కథానాయకుడిగా ఎంత సంతోషపడతానో.. లక్ష్మీదేవిగారి శిష్యుడిగా అంత గర్వపడుతున్నాను. 
 
అలాంటివారు దూరమవ్వడం తీరనిలోటు. నాకే కాదు తెలుగు సినిమాతో ముడిపడి ఉన్న ప్రతీ మనసుకి ఇవి బరువైన క్షణాలు. అలా బరువెక్కిన మనుసుతో నా చదువులమ్మకి కన్నీటి వీడ్కోలు పలుకుతున్నా. కనకాల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను' అంటూ మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవి హైద‌రాబాద్ నగరంలో అందుబాటులో లేరు. దీంతో ల‌క్ష్మీదేవి కుమారుడు, సినీ నటుడు రాజీవ్ క‌న‌కాల‌ను ఆయన ఫోన్ కాల్ ద్వారా ప‌రామ‌ర్శించారు. 
 
కాగా, 11 ఏళ్ల వయసులోనే నాటక రంగంలోకి ప్రవేశించిన లక్ష్మీదేవి, నాట్యకారిణిగా, నటిగా కళామతల్లికి సేవలు అందించారు. ప్రారంభంలో మద్రాస్‌ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో కళాకారులకు ఉపాధ్యాయురాలిగా ఆమె శిక్షణ ఇచ్చారు. శుభలేఖ సుధాకర్, సుహానిసి పలువురు ఆమె వద్ద శిక్షణ తీసుకున్న వారే. పలు చిత్రాల్లో కూడా ఆమె నటించారు.