శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 28 జనవరి 2018 (12:46 IST)

''సైరా'' నుంచి బిగ్ బి తప్పుకున్నారా? చిరంజీవి లుక్ ఇలా వుంటుందా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. త్వరలో రెండో షెడ్యూల్ జరుపుకోనున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ నటించనున్నట్లు చిత్ర యూనిట్ అధిక

SyeRaa
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. త్వరలో రెండో షెడ్యూల్ జరుపుకోనున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ నటించనున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ఇచ్చింది. 
 
అయితే ఈ సినిమా నుంచి బిగ్ బీ తప్పుకున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లకముందే సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్, ఆ తరువాత సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ సైరా టీం నుంచి తప్పకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
ఇకపోతే.. కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో రామ్‌ చరణ్ నిర్మిస్తున్న చిరు 151 మూవీ సైరా నరసింహారెడ్డి. ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు. తాజాగా  సురేందర్‌ రెడ్డి ఫన్నీగా సైరాలో చిరు లుక్‌పై హింట్‌ ఇచ్చాడు. తన కుమారుడికి సైరా గెటప్ వేసి ఫోటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసాడు. ఈ పిక్స్‌ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.