ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By TJ
Last Modified: గురువారం, 18 జనవరి 2018 (22:19 IST)

చిరంజీవి లాంటి అద్భుతమైన నటుడు మరొకరు లేదు - కెటిఆర్

సాధారణంగా రాజకీయాల్లోని వ్యక్తులు మరొకరిని పొగిడిన దాఖలాలు సామాన్యంగా ఉండవు. వారి పార్టీలోని వారిని మాత్రం పొగడ్తలతో ముంచెత్తి వెళ్ళిపోతుంటారు. అలాంటిది ఒక పార్టీకి చెందిన వ్యక్తి మరో పార్టీకి చెందిన వ్యక్తిని పొగడటమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది

సాధారణంగా రాజకీయాల్లోని వ్యక్తులు మరొకరిని పొగిడిన దాఖలాలు సామాన్యంగా ఉండవు. వారి పార్టీలోని వారిని మాత్రం పొగడ్తలతో ముంచెత్తి వెళ్ళిపోతుంటారు. అలాంటిది ఒక పార్టీకి చెందిన వ్యక్తి మరో పార్టీకి చెందిన వ్యక్తిని పొగడటమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. ఆయనెవరో కాదు తెలంగాణా మంత్రి కెటిఆర్. పొగిడింది మరెవరినో కాదు మెగాస్టార్ చిరంజీవిని. అసలు చిరంజీవిని కెటిఆర్ పొగడాల్సినంత అవసరం ఎందుకు వచ్చిందో తెలుసా..
 
తెలంగాణాలో కొత్త పరిశ్రమలను తీసుకురావడం కోసం కెటిఆర్ జపాన్‌లో పర్యటిస్తున్నారు. జపాన్ లోని షిజ్యేకా అనే ప్రాంతంలో ఉన్న హమామట్స్ అనే చిన్న పట్టణంలోని ఒక మ్యూజియంను సందర్సించాడు కెటిఆర్. అయితే అక్కడ జపాన్‌కు చెందిన ప్రముఖు వ్యక్తుల ఫోటోలతో పాటు మెగాస్టార్ ఫోటో కూడా ఉంది. ఆ ఫోటో చూసిన కెటిఆర్ ఆశ్చర్యపోయాడు. మన తెలుగు వాడు జపాన్‌లో గౌరవించబడటమా... చాలా ఆశ్చర్యంగా ఉందంటూ చిరంజీవి ఫోటో పక్కన ఫోటో తీసుకుని ట్వీట్ చేశాడు కెటిఆర్.