మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 19 జనవరి 2018 (14:39 IST)

సన్నీలియోన్‌‌కు అరుదైన గౌరవం.. మైనపు విగ్రహానికి మెజర్మెంట్లు..

బాలీవుడ్ సినీ నటి శృంగార తార సన్నీలియోన్‌... ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బిగ్ బి అమితాబ్ బచ్చన్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన చేరనుంది. ఢిల్లీలోని సుప్రసిద్ధ టుస్స

బాలీవుడ్ సినీ నటి శృంగార తార సన్నీలియోన్‌... ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బిగ్ బి అమితాబ్ బచ్చన్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన చేరనుంది. ఢిల్లీలోని సుప్రసిద్ధ టుస్సాడ్స్ మ్యూజియంలో సన్నీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

ఇప్పటికే ఈ మ్యూజియంలో మోదీ, బిగ్ బి, కత్రినా, హృతిక్ రోషన్, కపిల్ దేవ్ తదితరుల మైనపు విగ్రహాలున్న తరుణంలో.. వీరి సరసన సన్నీలియోన్ చేరబోతోంది. మేడమ్ టుస్సాడ్స్‌కు చెందిన నిపుణులు లండన్ నుంచి వచ్చి ముంబైలో సన్నీ లియోన్‌ను కలిశారు. 
 
ఈ సందర్భంగా సన్నీకి సంబంధించిన దాదాపు 200 మెజర్మెంట్స్ తీసుకున్నారు. ఈ విషయాన్ని సన్నీ తెలిపింది. టుస్సాడ్స్ బృందానికి ధన్యవాదాలు తెలిపింది. తాను ఎంతో థ్రిల్‌కు గురయ్యానని తెలిపింది. మ్యూజియంలో తన ప్రతిరూపాన్ని చూసేందుకు తాను కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని చెప్పింది. ఇది తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని సన్నీలియోన్ హర్షం వ్యక్తం చేసింది.