శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 23 జనవరి 2021 (11:20 IST)

ఆ తమిళ హీరో అన్ని నేర్పించాడంటున్న పంజాబీ బ్యూటీ!

తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఉన్న పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఈమె అటు తెలుగు, ఇటు తమిళ చిత్రాల్లో నటిస్తూ ముందుకుసాగుతోంది. ఈ క్రమంలో తమిళ హీరో శివకార్తికేయన్‌తో ఈ భామ అయలాన్ అనే చిత్రంలో నటించగా, ఈ మూవీ ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకుంది.
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శివకార్తికేయన్‌పై రకుల్ ప్రశంసలు కురిపించింది. కార్తికేయన్‌తో కలసి నటించడం సంతోషాన్నిచ్చిందని చెప్పుకొచ్చింది. చాలా మంచి నటుడంటూ కితాబిచ్చింది. డైలాగ్స్‌ను తమిళంలో ఎలా పలకాలో తనకు నేర్పించాడని చెప్పింది. 
 
తనకు కావాల్సిన ఆహారం చెన్నైలో ఎక్కడ దొరుకుతుందో చెప్పేవాడని తెలిపింది. షూటింగ్ సమయంలో ఆయనతో ఒక డీల్ కుదుర్చుకున్నానని... సెట్స్‌లో ఉన్నంత కాలం తనతో ఆయన తమిళంలో మాట్లాడాలి... ఆయనతో తాను ఇంగ్లీష్‌లో మాట్లాడాలనేదే ఆ డీల్ అని చెప్పింది. ప్రస్తుతం రకుల్ చేతిలో 7 సినిమాలు ఉన్నాయి.
 
మరోవైపు, బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో రకుల్ ప్రీత్ పేరు కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణకు కూడా ఆమె హాజరైంది. డ్రగ్స్ తీసుకునే అలవాటు తనకు లేదని విచారణలో ఆమె తెలిపింది. అయినప్పటికీ ఆమె ఈ కేసు నుంచి పూర్తిగా ఇంకా బయటపడలేదు.