శనివారం, 2 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 ఆగస్టు 2021 (15:27 IST)

అషు రెడ్డి కుర్చీలో కూర్చొని ఉండగా.. కింది నుంచి ఫోటో తీసిన వర్మ

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఏ పని చేసినా, ఏ వ్యాఖ్య చేసినా అది వివాదాస్పదమే. ఇపుడు అషు రెడ్డి కూర్చీలో కూర్చొనివుండగా, ఆర్జీవీ కింది నుంచి ఫోటో తీస్తున్న వీడియో క్లిప్ ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేశారు. ఇది వైరల్ అవుతోంది. 
 
బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి పాపులర్ అయిన బ్యూటీ అషు రెడ్డి. వర్మను ఇంటర్వ్యూ చేయడానికి ఈమె వెళ్లింది. ఇక తన ఇంటర్వ్యూ కోసం వచ్చిన లేడీ యాంకర్స్‌ పట్ల వర్మ ఎలా ప్రవర్తిస్తాడో అందరికి తెలిసిందే. తనదైన మాటలు, చేష్టలతో వారికి పొగిడేస్తుంటాడు. 
 
అషు రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. ఆమె ముందు తన ఫోటోగ్రఫీ టాలెంట్‌ని చూపించాడు. అషు రెడ్డి కుర్చీలో కూర్చొని ఉండగా.. వర్మ కింద కూర్చొని ఫోటో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 
 
అయితే వీరిద్దరి మధ్య జరిగిన ఇంటర్వ్యూ వీడియో ఇంకా బయటకు రాలేదు. ఇంటర్వ్యూకు సంబంధించిన ఓ క్లిప్ మాత్రం సోషల్ మీడియాలో హల్‏చల్ చేస్తోంది.