శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 23 మే 2019 (18:35 IST)

1982 మార్చి 29న టీడీపీ పుట్టింది.. 2019 మే 23న చనిపోయింది.... ఆర్జీవీ ట్వీట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలపై వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైనశైలిలో ట్వీట్ చేశారు. ఫ్యాను గాలి సునామీ సృష్టించగా, సైకిల్ టైర్లు పంక్చర్  అయ్యాయని వ్యాఖ్యానించారు. 
 
తాజాగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో మరికొన్ని పోస్టులు పెట్టారు. పసుపు కుంకుమ తీసుకొని ఏపీ మహిళలు ఉప్పుకారం రాశారంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా, టీడీపీ పుట్టింది 29 మార్చి 1982న అయితే.. 23 మే, 2019న చచ్చిపోయింది. టీడీపీ చచ్చిపోవడానికి అబద్ధాలు, వెన్నుపోట్లు, అవినీతి, అసమర్థత, వైఎస్.జగన్, నారా లోకేశ్ అంటూ ట్వీట్ చేశారు.
 
అంతేకాకుండా ఏపీ శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూనే, ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన చంద్రబాబు నాయుడుకు తన సానుభూతి తెలుపుతున్నట్టు ఆర్జీవీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
ఇకపోతే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా చేసుకుని తీసిన 'యాత్ర' సినిమా, ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా తీసిన 'ఎన్టీఆర్' బయోపిక్‌లకు లభించినట్టుగానే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉన్నాయంటూ చమత్కరించారు. అదేసమయంలో రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటించిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పైనా సెటైర్‌ వేశారు. ఆయనను ఎవరో బలవంతంగా తీసుకువెళ్తున్నట్లు ఉన్న ఫొటోను పోస్టు చేస్తూ దాని కింద 'ఇంకెప్పుడూ సర్వే చేయను, నన్ను వదిలేయండి' అంటా కామెంట్స్ పెట్టారు.