Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Jagapathi Babu: టెక్నాలజీ ఉపయోంచేందుకు రామ్ సహకరించారు : జగపతిబాబు

Written By దేవీ
Updated: మంగళవారం, 21 ఏప్రియల్ 2026 (15:23 IST)
Jagapathi Babu Lanuched Koniki Lux Skincare
"నాకు రామ్ తో నా సెకండ్ ఇన్నింగ్స్ లెజెండ్ చిత్రం నుండి నా ప్రయాణం మొదలైంది. అప్పటి నుండి నా ప్రతి హెయిర్ స్టైల్ రామ్ చేసిందే. నాకు కావలసిన వ్యక్తి, మంచి వ్యక్తిత్వం, మంచి వర్క్ తెలుసు. ఎంతో మంది సెలబ్రిటీలు ఆయనకు మంచి పరిచయస్థులు, అందరితో బాగా కలిసిపోతారు అని జగపతి బాబు అన్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ఫేమస్ అయిన రామ్ కొణికి ఇప్పుడు కొత్తగా "కొణికి లక్స్" పేరిట స్కిన్ కేర్ ప్రారంభించారు. రామ్ కొనికి ఇప్పుడు డెర్మటాలజిస్ట్ డాక్టర్ అలేఖ్య రెడ్డి నేతత్వంలో ఎంతో నైపుణ్యం ఉన్న వారి చేత  ఎంతో ఆధునిక టెక్నాలజీ తో సర్టిఫైడ్ పరికరాల ద్వారా పర్సనల్ కేర్ తీసుకుని ప్రోటోకాల్ ప్రకారం స్కిన్ కేర్ తీసుకునే దిశగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 45లో నటుడు జగపతిబాబు గారి చేతుల మీదగా సలూన్ కొణికి వద్దనే ప్రారంభించడం జరిగింది. 
 
ఈ సందర్భంగా నటుడు జగపతిబాబు గారు మాట్లాడుతూ...  నాకు రామ్ చాలా దగ్గర వ్యక్తి. తను నన్ను ప్రారంభించాలి అని ఆహ్వానించడం నాకు విశేషమైనది. నాకు ఇప్పటి వరకు నా జీన్స్ వల్ల టెక్నాలజీ ఉపయోంచే అవసరం అంతగా రాలేదు కాని ఇటీవలే కాస్త ఉపయోగించవలసి వచ్చింది, అది కూడా రామ్ చేతుల మీదగానే జరిగింది. గతంతో పోలిస్తే ఎప్పటికప్పుడు రామ్ అప్డేట్ అవుతూ ఉంటారు, ఆ అప్డేట్ మార్పు ఇక్కడ చాలా ముఖ్యం" అన్నారు. 
 
రామ్ కొణికి గారు మాట్లాడుతూ, వైద్యుల  నేతృత్వంలో పూర్తిగా ప్రొఫెషనల్స్ తో ఎంతో జాగ్రత్తగా, ఎంతో ఆధునిక సరికొత్త పరికరాలతో స్కిన్ కేర్ అనేది చేయబోతున్నాము. జగపతి బాబు గారి చేతుల మీదగా కొణికి లక్స్ ప్రారంభం కావడం ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఆయనతో నా పరిచయం చాలా కాలం నాటిది. ఆయనకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సినిమాలో ఆయన క్యారెక్టర్ బట్టి కావాల్సిన విధంగా ఆయన హెయిర్ స్టైల్ మార్చడం జరుగుతుంది. దానికి ఆయన పూర్తిగా సహకారం అందిస్తారు. మేము చేసే ప్రతి పనిలో పూర్తిగా ప్రొఫెషనల్స్ ద్వారా చాలా జాగ్రత్తగా ఉంటాము" అన్నారు. 
 
డాక్టర్ అలేఖ్య రెడ్డి మాట్లాడుతూ... "మేము ముఖ్యంగా ఈ ప్రాసెస్ లో సేఫ్టీ చూస్తాము. అలాగే ఒక వ్యక్తిగతమైన ప్రోటోకాల్ ప్రకారం ముందుకు వెళ్తాము. మా దగ్గర స్కిన్ కు సంబంధించి పూర్తి స్థాయిలో సర్టిఫికేషన్ చేసిన ఆధునిక పరికరాలు ఉన్నాయి" అన్నారు.
About Author
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... Read More

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Custard apples సీతాఫలాలు వచ్చాయి, తినేవారు తెలుసుకోవాల్సినవి

Almonds బాదం పప్పులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా?

చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

తర్వాతి కథనం
Show comments