శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: బుధవారం, 15 మే 2019 (14:00 IST)

వామ్మో... హీరో రామ్ 'ఇస్మార్ట్ శంకర్' ముదురు ఊర మాస్ గురూ...(video)

స్మార్ట్ హీరో రామ్, మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న ఇస్మార్ట్ శంకర్ చిత్రం టీజర్ వచ్చేసింది. ఈ టీజర్ చూస్తుంటే స్మార్ట్ పాత్రల్లో కనిపించే హీరో రామ్ ఒక్కసారిగా ఊరమాస్ పాత్రలో కనిపించి అదరగొట్టాడు. ఆ పాత్రలో రామ్ ఎనర్జీ మామూలుగా లేదు మరి. ఈ టీజర్ రామ్ పుట్టినరోజు అయిన మే 15న చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.  
 
ఈ టీజర్లో శంకర్ పాత్రలో రామ్ ఉర్దూ, తెలుగు మిక్స్ చేసి చెప్పాడు. ‘నియ్యమ్మ ఒరేయ్..’, ‘పతాయే మే కౌన్ హు.. శంకర్.. ఉస్తాద్, ఇస్మార్ట్ శంకర్’ అంటూ రామ్ పూర్తి మాస్ లుక్ లో కనిపిస్తూ చెప్పే డైలాగులు హైఓల్టేజీలో వున్నాయి. మరి ఈ డైలాగులు, రామ్ కొత్త లుక్‌ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సిందే. 
 
ఇకపోతే ఈ చిత్రంలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్యదేవ్ ముఖ్యపాత్ర పోషిస్తుండగా పూరీ కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మిలు సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. టీజర్ చూడండి..