గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 22 జులై 2022 (16:59 IST)

రెయిన్ కోట్లు ఇచ్చిన రామారావ్ ఆన్ డ్యూటీ చిత్ర యూనిట్‌

Rama Rao On Duty Rain Coats
Rama Rao On Duty Rain Coats
ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో విప‌రీతంగా వ‌ర్షాలు ప‌డుతున్నాయి. ఈరోజు తెల్ల‌వారు జామున‌నుంచే వ‌ర్షం ఆరంభమైంది. కొద్దిసేపు తెరిపించినా మ‌ధ్యాహ్నం నుంచి ధార‌పోత‌గా వ‌ర్షం ప‌డుతూనే వుంది. ఒక‌వైపు సినిమాలు విడుద‌ల‌కాబోతున్నాయి. కొన్ని సినిమాలు ఈరోజే విడుద‌ల‌య్యాయి. వ‌ర్షాల‌కు ప్రేక్ష‌కులు పెద్ద‌గా క‌నిపించ‌డంలేదు.
 
Rama Rao On Duty Rain Coats
Rama Rao On Duty Rain Coats
అయితే ఈనెల 29న విడుద‌ల‌కాబోతున్న రామారావ్ ఆన్ డ్యూటీ చిత్ర యూనిట్ హైద‌రాబాద్‌లోని పండ్ల మార్కెట్‌కు వెళ్ళి అక్క‌డివారికి రెయిన్ కోట్లు పంపిణీ చేశారు.  వాతావరణంలో ఇబ్బంది పడకుండా, ప్రతిరోజూ కష్టపడి పనిచేసే నిరుపేద పండ్ల విక్రయదారులకు రెయిన్‌కోట్‌లను పంపిణీ చేసింది చిత్ర యూనిట్‌.
 
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలోశరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ'. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.