గురువారం, 30 నవంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 7 మార్చి 2023 (12:05 IST)

లాస్ ఏంజెల్స్ లో మెగా ఫాన్స్ తో రాంచరణ్

ramcharan us prakatana
ramcharan us prakatana
మెగాపవర్ స్టార్ నుండి Global Star గా శ్రీ రామ్ చరణ్ గారు ఎన్నో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులు, గౌరవం పొందిన శుభ సందర్భంగా మనందరి కోరిక మేర మార్చి 11 వ తేదీన ఉదయం 10:35 ని ll లకు లాస్ ఏంజెల్స్ లో  అభిమానులను  కలవడానికి అనుమతిని ఇచ్చారు అని -  USA మెగా  అభిమానులు ప్రకటన విడుదల చేశారు. 
 
కావున మనందరం అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత  శ్రీ రామ్ చరణ్ గారిని సత్కరించు కొనే అవకాశం,  సమయం ఆసన్నమైంది. మన ఆప్తులు, USA మెగా అభిమానులు అందరూ తప్పక విచ్చేసి జయప్రదం చేస్తారని ఆశిస్తూ... కోరుచున్నాను అంటూ  USA మెగా ఫాన్స్ అసోసియేషన్ తెలిపింది. 
 
మెగా స్టార్ చిరంజీవికి అక్కడ అభిమానూలు ఎక్కువ. చిరంజీవి బ్లడ్, ఐ బ్యాంకు కార్యకలాపాలు కూడా జరుగుతుంటాయి. అపుడప్పుడు చిరంజీవి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ స్వామి నాయుడు వెళ్లి అక్కడ పలు కార్యకలాపాలు చేస్తుంటారు.