గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 1 మార్చి 2023 (17:32 IST)

మా మార్క్ చూపించ‌టానికి ఇదే స‌రైన త‌రుణం : రామ్ చ‌ర‌ణ్‌

Ram Charan
Ram Charan
మెగా ప‌వ‌ర్‌స్టార్ యు.ఎస్‌లో సంద‌డి చేస్తున్నారు. ఇటీవ‌లే ఆయ‌న గుడ్ మార్నింగ్ అమెరికా షోతో పాటు ఏబీసీ న్యూస్ వాళ్లు నిర్వ‌హించిన ఇంట‌ర్వ్యూస్‌లో పాల్గొన్న రామ్ చ‌ర‌ణ్ ఇప్పుడు లాస్ ఏంజిల్స్ వైబ్స్‌లో మునిగి తేలుతున్నారు. యు.ఎస్‌లో ఇప్పుడంద‌రూ చ‌ర‌ణ్‌ను గ్లోబ‌ల్ స్టార్ అని పిలుస్తున్నారు. ఈ నేప‌థ్యంలో లాస్ ఏంజిల్స్లోని పాపుల‌ర్ ఎంట‌ర్‌టైన్మెంట్ చానెల్ KTLA రామ్ చ‌ర‌ణ్‌ను ఇంట‌ర్వ్యూ చేసింది. 
 
- లాస్ ఏంజిల్స్‌లో మార్చి 12న 95వ ఆస్కార్ అవార్డుల ప్ర‌దానోత్స‌వం జ‌ర‌నుంది. ఈ క్ర‌మంలో రామ్ చ‌ర‌ణ్ ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌పై ప్ర‌ధానంగా దృష్టి పెట్టారు. KTLAకి చెందిన శామ్ రూబిన్ వెర్స‌టైల్ యాక్ష‌న్ హీరో రామ్ చ‌ర‌ణ్‌తో మాట్లాడుతూ ఆస్కార్ నామినేష‌న్స్ గురించి, ప్ర‌స్తుతం అత‌ని ఆలోచ‌నా విధానంపై ప్ర‌త్యేకంగా అడిగి తెలుసుకున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఆస్కార్ అవార్డుల వేడుక‌లో RRR చేయ‌బోతున్న లైవ్ పెర్ఫామెన్స్ గురించి అంద‌రిలోనూ తెలియ‌ని ఎగ్జ‌యిట్‌మెంట్ నెల‌కొంది. RRR మేకింగ్ స‌మ‌యంలో జ‌రిగిన మ్యాజిక్ గురించి ‘నాటు నాటు..’ సాంగ్ తెరకెక్కించేటప్పుడు కలిగిన ఎక్స్‌పీరియెన్స్ గురించి రామ్ చ‌రణ్ ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు. 
 
RRR చిత్రానికి ప్ర‌పంచ వ్యాప్తంగా అద్భుత‌మైన రావ‌టంపై మీరెలా భావిస్తున్నారు.
 
- మా డైరెక్ట‌ర్ రాజ‌మౌళిగారు రాసిన అత్యుత్త‌మ చిత్రాల్లో RRR ఒక‌టి. ఇందులో చాలా జోన‌ర్స్ మిళిత‌మై ఉన్నాయి. డ్రామా, ఇద్ద‌రి హీరోల మ‌ధ్య ఉన్న సోద‌ర అనుబంధాన్ని ఎలివేట్ చేసిన తీరు అన్నీ చ‌క్క‌గా క‌లిశాయి. ఇది అల్లూరి, భీమ్ అనే ఇద్ద‌రి కుర్రాళ్ల మ‌ధ్య ఉండే స్నేహాన్ని తెలియ‌జేస్తూనే,  భారతదేశం ఎదుర్కొన్న వలసవాద అణచివేతకు వ్యతిరేకంగా చేసిన పోరాటం గురించి కూడా తెలియ‌జేసింది. ఈ ఎలిమెంట్స్ అన్నీ ప‌లు ర‌కాలు ప‌లువురి సెంటిమెంట్స్‌ను ట‌చ్ చేసింది. 
 
‘నాటు నాటు’ పాటలో  మెరుపులా సాగే డాన్స్‌, అద్భుత‌మైన మ్యూజిక్ ఆడియెన్స్‌ను అల‌రించాయి. ఆ పాట‌ను చేసే క్ర‌మంలో మీలో అది ఉత్సాహాన్ని నింపిందా లేదా నిరుత్సాహాంగా అనిపించిందా?
 
- నేనెప్పుడూ చిన్న‌పిల్లాడిలా డాన్స్ చేయ‌లేదు. నాకు నిర్మాత మంచి రెమ్యూనరేష‌న్‌ను ఇచ్చారు (న‌వ్వుతూ) కాబ‌ట్టి నేను త‌ప్ప‌కుండా డాన్స్ చేయాల్సిందే. ‘నాటు నాటు’ అనేది చాలా అందమైన సాంగ్స్‌లో ఒకటి. ఈ పాట చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో సెట్‌లో దాదాపు 300 మంది ప్రొఫెషనల్ డ్యాన్సర్లు ఉన్నారు. 7 రోజుల రిహార్సల్ తర్వాత 17 రోజుల పాటు పాట‌ను చిత్రీకరించారు. ప్రేక్ష‌కులు నేను మంచి డాన్సర్ అని భావిస్తారు. అయితే ఆ ట్యాగ్ ఎలా వ‌చ్చిందో నాకు తెలియ‌దు. కానీ.. వారి అంచ‌నాల‌ను నిల‌బెట్టుకోవాల్సి ఉంది (న‌వ్వుతూ)
 
ఆస్కార్ వేడుక‌ల్లో లైవ్ పెర్ఫామెన్స్ గురించి తెలియ‌చేయండి..
 
- ఇప్ప‌టికీ వ‌ర‌కు ప్రేక్షకులు మాకు చాలానే ఇచ్చారు. పాటను ఆస్కార్ వేడుక‌ల్లో లైవ్‌లో ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకులకు నా ప్రేమను చూపించడం అనేది ఓ మార్గం. అలా చేయ‌టం నేను వారికిచ్చే రిట‌ర్న్ గిఫ్ట్‌. 
 
"నాటు నాటు" సాంగ్‌కి గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు ప‌లు అంత‌ర్జాతీయ అవార్డులు రావ‌టం ఆస్కార్‌కి ఎంపిక కావ‌టం ఎలా అనిపిస్తుంది.
 
- నా జీవితంలో ఇవి అద్భుత‌మైన క్ష‌ణాలు. ఆస్కార్ వేడుక‌ల్లో నేను ఓ అతిథిగా ఉండాల‌నుకున్నాను. ఇప్పుడు నామినేట్ అయ్యాను. నేను ఆ బ్లాక్ లేడీని మా టీమ్‌తో క‌లిసి మా దేశానికి తీసుకెళ్ల‌టానికి చాలా ఎగ్జ‌యిట్మెంట్‌తో ఎదురు చూస్తున్నాను. మార్చి 3న మా సినిమా యు.ఎస్‌లో రీ రిలీజ్ అవుతుంది. సినిమా క‌చ్చితంగా మిమ్మ‌ల్ని నిరాశ ప‌ర‌చ‌ద‌ని భావిస్తున్నాను. 
 
ఆస్కార్ రేసులో మీ పాట ఉండ‌టంపై మీరెలా భావిస్తున్నారు?
 
- ఓ న‌టుడిగా అది నాకెంతో సంతృప్తిని క‌లిగించే క్ష‌ణాలు. మా ఇండియ‌న్ సినిమాలో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు 85 ఏళ్ల చ‌రిత్ర ఉంది. ఇప్పుడు మీరు మ‌మ్మల్ని గుర్తించారు. మా సినిమా ఎంతో బాగుంద‌ని అప్రిషియేట్ చేశారు. నేను వివిధ దేశాల్లో ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇండ‌స్ట్రీలో మా మార్క్ చూపించ‌టానికి ఇదే స‌రైన త‌రుణంగా భావిస్తున్నాం.