శనివారం, 13 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 9 జూన్ 2022 (16:43 IST)

మాయా పేటిక లుక్ విడుదల చేసిన రానా దగ్గుబాటి

maya petika look
maya petika look
జ‌స్ట్ ఆర్టిన‌ర్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.2 మూవీగా రూపొందుతోన్న చిత్రం ‘మాయా పేటిక’. ఈ సినిమా టైటిల్ లుక్‌ను టాలీవుడ్ హండ్స‌మ్ హంక్ రానా ద‌గ్గుబాటి విడుద‌ల చేశారు. ‘థాంక్యూ బ్రదర్’ వంటి వైవిధ్యమైన చిత్రాన్ని రూపొందిన ఇదే నిర్మాణ సంస్థ‌లో మ‌రో వెరైటీ చిత్రాన్ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. 
 
ర‌మేష్ రాపార్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి మాగుంట శ‌ర‌త్ చంద్రా రెడ్డి, తార‌క్‌నాథ్ బొమ్మి రెడ్డి నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమాకు గుణ బాల సుబ్ర‌మ‌ణియ‌మ్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తుండ‌గా సురేష్ ర‌గుతు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. కామెడీ, డ్రామా జోన‌ర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఇత‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామని మేక‌ర్స్ తెలియ‌జేశారు.