బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 2 ఏప్రియల్ 2018 (18:08 IST)

రంగస్థలం హిట్: పృథ్యీ, చరణ్ కామెడీ ట్రాక్‌ను కత్తిరించారా?

''రంగస్థలం'' చిత్రం బంపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాలు ఉన్నప్పటికీ ఎక్కడా కూ

''రంగస్థలం'' చిత్రం బంపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాలు ఉన్నప్పటికీ ఎక్కడా కూడా ఆడియన్స్ బోర్ ఫీలవ్వడం లేదనే టాక్ వినిపిస్తోంది. విడుదలకి ముందు ఈ సినిమా నిడివి ఇంతకన్నా ఎక్కువగా ఉందట. 
 
దీంతో కొన్ని సన్నివేశాలను కత్తిరించారట. ఇందులో కొన్ని సీన్స్ పృథ్వీకి సంబంధించినవనేది తాజా సమాచారం. ఈ సినిమా సెకండాఫ్‌లో డ్రామాతో సంబంధం లేకుండా పృథ్వీ.. చరణ్ కాంబినేషన్లో చిన్నపాటి కామెడీ ట్రాక్‌ను చిత్రీకరించారట. ఈ కామెడీ ట్రాక్‌ను నిడివి కారణంగా కత్తిరించినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
 
ఇకపోతే.. హైదరాబాద్‌లో ''రంగస్థలం'' విజయోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన రామ్ చరణ్ మాట్లాడుతూ, ఈ సినిమా విజయం కోసం చిత్ర బృందం ఎంతో కృషి చేసిందని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ప్రకటించాడు. సినిమా విజయం సాధించి అందరికీ పదిరూపాయలొస్తే సంతోషపడతానని.. ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకుని, కమర్షియల్‌గా ఆలోచించి తానెప్పుడూ సినిమాలు ఒప్పుకోలేదన్నాడు. 
 
ఫ్యాన్స్ కోసం సినిమా చేసే నటుడిని తాను కాదని, అలాంటి ఆలోచనే ఉంటే ''రంగస్థలం'' వచ్చేది కాదని చెర్రీ చెప్పుకొచ్చాడు. రంగస్థలం సక్సెస్ కావడంపై చెర్రీ హర్షం వ్యక్తం చేశారు. ఇదే తరహాలో వేసవిలో విడుదల కాబోయే చిత్రాలు కూడా మంచి విజయం సాధించాలని తాను కోరుకుంటున్నానని చెర్రీ తెలిపారు.