శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 12 సెప్టెంబరు 2018 (13:48 IST)

ఏం చేయను.. బ్రేకప్ జరిగిన విషయం నిజమే... రష్మిక మందన్న

గీత గోవిందం హీరోయిన్ రష్మిక మందన్నకు కన్నడ నిర్మాత, హీరో రక్షిత్ శెట్టితో జరిగిన నిశ్చితార్థం రద్దు అయింది. ఇలా ఎందుకు జరిగిందో తెలియదు. దీనిపై రష్మిక లేదా రక్షిత్‌లు పెదవి విప్పడం లేదు. అయితే, బ్రేకప

గీత గోవిందం హీరోయిన్ రష్మిక మందన్నకు కన్నడ నిర్మాత, హీరో రక్షిత్ శెట్టితో జరిగిన నిశ్చితార్థం రద్దు అయింది. ఇలా ఎందుకు జరిగిందో తెలియదు. దీనిపై రష్మిక లేదా రక్షిత్‌లు పెదవి విప్పడం లేదు. అయితే, బ్రేకప్‌పై రష్మిక తల్లి కూడా క్లారిటీ ఇచ్చింది. ఇపుడు రష్మిక కూడా స్పష్టం చేసింది.
 
అయితే అసలు నిశ్చితార్థం ఎందుకు రద్దు చేసుకున్నారు? అందుకు కారణాలేంటి? అనే విషయం మాత్రం బయటకు రాలేదు. కాగా ఇదే విషయంపై తాజాగా రష్మిక కూడా నేరుగా స్పందించింది. బ్రేకప్ జరిగిన విషయం నిజమేనని, అయితే అందుకు గల కారణాలు మాత్రం సమయం వచ్చినపుడు చెబుతానని తెలిపింది. అప్పటిదాకా అందరూ సహనంతో ఉండాలని ప్రాధేయపడింది.
 
ఇకపోతే, రష్మిక 2017లో కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం జరిగింది. అయితే ఈ నిశ్చితార్థం రద్దయిందని గత కొంతకాలంగా వార్తలు షికారు చేస్తున్నాయి. కెరీర్ మంచి గ్రోత్‌లో సాగిపోతూ ఎక్కువ అవకాశాలు వస్తుండటంతో రష్మిక ఈ నిర్ణయం తీసుకుందని కొన్ని వార్తలు వచ్చాయి. అలాగే, ఇద్దరి మధ్య మనస్పర్థలు రావటం కారణంగానే ఇలా జరిగిందంటూ మరికొన్ని వార్తలు వచ్చాయి. దీంతో ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి వుంది.