శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 28 మార్చి 2023 (20:22 IST)

రావణాసుర థియేట్రికల్ ట్రైలర్ విడుదల

Raveteja new look
Raveteja new look
రవితేజ మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, ఫుట్‌టాపింగ్ సౌండ్‌ట్రాక్‌లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు మేకర్స్ రావణాసుర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
 
రావణాసుర టీజర్‌ లో సినిమాలోని యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ని చూపించారు. ట్రైలర్ కోర్ పాయింట్ గురించి పెద్దగా వెల్లడించనప్పటికీ, ఇతర అంశాలను ప్రజంట్ చేసింది. ఇది మర్డర్ మిస్టరీగా ప్రారంభమవుతుంది. సంపత్ రాజ్ తాను నిర్దోషినని చెబుతాడు. క్రిమినల్ లాయర్ అయిన రవితేజ తన సీనియర్ ఫారియా అబ్దుల్లాను కేసును టేకప్ చేయాల్సిందిగా కోరుతాడు. కానీ ఆమెకు కనీసం ఆసక్తి లేదు. అప్పుడు, రవితేజ పాత్రలోని ఇతర షేడ్స్‌ని చూస్తాము. పోలీసు అధికారి, రాజకీయ నాయకుడు అతన్ని క్రిమినల్ అని పిలుస్తుండగా, అతను కూడా చివరికి అదే ఒప్పుకుంటాడు.
 
సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయో చూపించేలా ట్రైల‌ర్‌ని గొప్ప నేర్పుతో ఎడిట్ చేశారు. . అయితే, సినిమా కోర్ పాయింట్ ఏమిటనేది చూపించకుండా మరింత క్యురియాసిటీని పెంచారు. దర్శకుడు సుధీర్ వర్మ తన టేకింగ్‌ తో కట్టిపడేశారు. రవితేజను చాలా షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేశాడు.  
 
రవితేజ ఫుల్ ఎనర్జీతో ఉన్నారు. రవితేజ కామిక్ టైమింగ్ సాధారణంగా అద్భుతంగా వుంటుంది. అయితే  పాత్ర యొక్క డార్క్ షేడ్స్ ని చూసే చివరి షాట్ ఎక్స్ టార్డీనరీగా వుంది. జోకర్ పోస్టర్ యాటిట్యూడ్, ఈవిల్ స్మైల్ చూడటానికి ఒక ట్రీట్‌లా వున్నాయి.
 
హర్షవర్ధన్ రామేశ్వర్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా పనితనం బ్రిలియంట్ గా వుంది. హర్షవర్ధన్‌తో పాటు, భీమ్స్ సిసిరోలియో చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లు అందించారు.
 
అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ రావణాసురని నిర్మించారు.ప్రొడక్షన్ డిజైన్ అత్యున్నతంగా వుంది. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్‌గా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాపై థియేట్రికల్ ట్రైలర్‌ అంచనాలని మరింతగా పెంచింది.