1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 14 జనవరి 2022 (14:08 IST)

చిరంజీవి ప్రారంభించిన రవితేజ రావణాసుర చిత్రం

Ravanasura poster
మాస్ మహారాజ రవితేజ  హీరోగా  అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై క్రియేటివ్ డైరెక్టర్  సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం "రావణాసుర" . ఈ చిత్రం జనవరి 14న బోగి సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షం లో అన్నపూర్ణ స్టూడియోలో అత్యంత వైభవంగా ప్రారంభమయింది. పూజా కార్యక్రమాలు అనంతరం   దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు స్క్రిప్ట్ అందించారు. రవితేజ పై చిత్రీకించిన ముహూర్తపు సన్నివేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి క్లాప్ నివ్వగా, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ దర్శకులు కే.యస్.రవీంద్ర (బాబీ), గోపీచంద్ మలినేని గౌరవ దర్శకత్వం వహించారు.. రావణాసుర పోస్టర్ ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. 
 
ఈ పోస్టర్ లో రవితేజ వైట్ షర్ట్ కోటు వేసుకొని సిగరెట్ వెలిగి స్తుండగ  షర్ట్ పై బ్లడ్, ఫైర్ కనిపిస్తుంది.. శ్రీకాంత్ విస్సా కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్న ఈ చిత్రంలో యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రలో రామ్ గా నటిస్తుండగా, అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్ , ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. అందరికీ ఇంపార్టెన్స్ వుండే విధంగా క్యారెక్టర్స్ ని డిజైన్ చేశారు.  ఈ నెల లోనే రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా రవితేజ ని డిఫరెంట్ క్యారెక్టర్ లో సుధీర్ వర్మ ప్రజెంట్ చేయనున్నారు.. ప్రీ- ప్రొడక్షన్ స్టేజ్ లోనే "రావణా సుర" చిత్రం బిగ్గెస్ట్ హిట్ కానుందని చిత్ర యూనిట్ లో టాక్ వినిపిస్తుంది.. సెప్టెంబర్ 30,2022 న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నట్టు విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియా లో నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ వైరల్ అయ్యింది.
 
 
న‌టీన‌టులుః రవితేజ, సుశాంత్, అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కార్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా, సత్య, జయప్రకాష్, తదితరులు
 
సాంకేతిక‌తః 
దర్శకత్వం; సుధీర్ వర్మ, కథ, స్క్రీన్ ప్లే, మాటలు; శ్రీకాంత్ విస్సా, సంగీతం; హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్, కెమెరా; విజయ్ కార్తీక్ కన్నన్, ఎడిటర్; శ్రీకాంత్ని ర్మాత; అభిషేక్ నామా.