"క్రాక్" విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న రవితేజ.. 'ఖిలాడి' ఫస్ట్ లుక్ రిలీజ్
సంక్రాంతికి ముందు వచ్చిన చిత్రం "క్రాక్". మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఈ చిత్రం జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయాన్ని హీరో రవితేజతోపాటు... చిత్ర యూనిట్ కూడా ఎంజాయ్ చేస్తోంది.
అయితే రవితేజ వెంటనే తన కొత్త సినిమా ఖిలాడీపై ఫోకస్ పెట్టాడు. రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేయాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. ఓ వైపు "క్రాక్" సక్సెస్‌తో సంబురాలు చేసుకుంటున్న రవితేజ అభిమానులకి ఇది ఓ శుభవార్తే.
ఈ క్రమలో జనవరి 26వ తేదీన రవితేజ పుట్టినరోజు వేడుకలను జరుపుకోనున్నారు. ఆ రోజున "ఖిలాడి" టీజర్‌ను విడుదల చేయాలని మేకర్స్ ఫిక్సయినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం.
ఈ చిత్రంలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వేసవిలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దేవీ శ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు.
ఇకపోతే, గత 2020లో కరోనాతో విశ్రాంతి తీసుకున్న రవితేజ ఈ సారి మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఆలరించడానికి సిద్ధమవుతున్నాడు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్‌ను ట్విటర్‌లో రవితేజ షేర్ చేశాడు.