ప్రభాస్‌తో మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమే - గోపీచంద్
బన్నీ వాస్ నిర్మాతగా మ్యాచో హీరో గోపీచంద్‌తో చేస్తున్న పక్కా కమర్షియల్ . మారుతి దర్శకుడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో సక్సెస్ ఫుల్ బ్యానర్లుగా అందరి మన్ననలు అందుకున్న జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ కాన్ఫెరెన్స్ విజయవాడలోని రాజ్ యువారాజ్ థియేటర్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు చిత్రయూనిట్.
ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హీరో గోపీచంద్ గారు మాట్లాడుతూ.. పక్కా కమర్షియల్ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని.. కచ్చితంగా అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. అలాగే తనకు ప్రభాస్ అంటే చాలా యిష్టమని.. ఎప్పుడైనా తనతో నటించడానికి సిద్ధమే అని తెలిపారు. పైగా ఆయనతో మల్టీస్టారర్ చేయాలని ఉన్నట్లు చెప్పారు గోపీచంద్. పక్కా కమర్షియల్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాను మారుతి చాలా తెరకెక్కించారని తెలిపారు. అనంతరం చిత్రయూనిట్ కనకదుర్గమ్మ గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు.