హీరోయిన్ల క్యారెక్టర్‌పై కామెంట్లా.. ఎంత మందితో పడుకుందని..?

Written By సెల్వి
Updated: శనివారం, 28 అక్టోబరు 2023 (10:19 IST)
హీరోయిన్ల క్యారెక్టర్‌పై దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ అన్నారు. హీరోయిన్లపై వచ్చే కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయి లుక్‌పై, యాక్టింగ్ కామెంట్స్ చేయవచ్చునని.. క్యారెక్టర్‌పై మాత్రం కామెంట్స్ చేయకూడదని చెప్పారు. 
 
ఎంత మందితో పడుకుంది అని మాట్లాడుతూ ఆడవాళ్ల వ్యక్తిత్వాన్ని చంపేస్తున్నారని రేణూ దేశాయ్ తెలిపారు. ఇలాంటివి మానుకోవాలని సూచించారు. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై రాజకీయ విమర్శలు చేసినా, ఆయన మేనిఫెస్టోను విమర్శించినా తనకు ఇబ్బందిలేదన్నారు 
 
అయితే ప్రతిసారీ తనను, తన పిల్లలను లాగడం ఏమిటని ప్రశ్నించారు. తమను టార్గెట్ చేయడం మరీ ఎక్కువవుతోందని.. దాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిదన్నారు. అలాగే అకీరానందన్‌ బర్త్ డే సమయంలో నెలకొన్న వివాదానికి క్లారిటీ ఇచ్చింది.  
 
ఇక రేణు దేశాయ్‌ ఇటీవల "టైగర్‌ నాగేశ్వరరావు" చిత్రంలో హేమలత లవణం పాత్రలో నటించింది. రియల్‌ లైఫ్‌లో ఉన్న పాత్ర ఆమెది. సినిమాలో చివరి పది నిమిషాల్లో వచ్చింది రేణు దేశాయ్‌.

అయితే సినిమాలో ఆమె పాత్రకి చాలా ప్రయారిటీ ఉంటుందని అంతా భావించారు. టీమ్‌ కూడా అలానే చెప్పొకొచ్చింది. కానీ తీరా ఆమె పాత్ర నిడివి మరీ తక్కువగా ఉండటం, పైగా అది బలంగా లేకపోవడంతో ఆడియెన్స్‌ని నిరాశ పరిచింది. 

అన్నీ చూడండి

జూలై 29, 2026న తెలుగు రాష్ట్రాల వాతావరణం... తెలంగాణలో చల్లచల్లగా.. ఏపీలో ఉక్కపోత

భార్యపై అనుమానం, నీ కూతురు చావును కళ్లారా చూడండి, ఉరి వేసి అత్తమామలకు అల్లుడు వీడియో కాల్

7,000 మందికి పైగా విద్యార్థులకు హెచ్‌ఐవి పాజిటివ్.. ఎక్కడో తెలుసా?

ఏపీలో రెండు కోవిడ్ కేసులు నమోదు.. ఒమిక్రాన్ లీనియేజ్ రకం వైరస్.. నడ్డా

జూలై 31 నుంచి బ్రాయిలర్ కోళ్ల విక్రయాలను నిరవధికంగా నిలిపివేస్తాం.. ఎక్కడ... ఎందుకు?

అన్నీ చూడండి

కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్

గర్భిణీ స్త్రీలు నామల చేపలు తినవచ్చా?

మోకాలి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం లేదు, ఐతే...

ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే గుండె పోటు కావచ్చేమో చెక్ చేయించుకోవాలి

లెమన్ గ్రాస్ టీ తాగితే 5 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments