శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (20:36 IST)

రిపబ్లిక్' ప్రీ-రిలీజ్.. అల్లుడి కోసం రంగంలోకి పవర్ స్టార్

Saidharam tej
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'రిపబ్లిక్' విడుదలకు సిద్ధంగా ఉంది. అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. రోడ్డుప్రమాదానికి గురైన సాయితేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు ఎక్కడా ఆగడంలేదు. ఈ క్రమంలో సెప్టెంబరు 25న 'రిపబ్లిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
 
తన మేనల్లుడు కోసం పవర్ స్టార్ ఆ సినిమా ప్రమోషన్‌లో పాలుపంచుకుంటున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కూడా 'రిపబ్లిక్' చిత్రం ట్రైలర్ విడుదల చేసి మేనల్లుడి చిత్రానికి తనవంతు ప్రచారం కల్పించారు. దేవా కట్టా దర్శకత్వంలో వస్తున్న 'రిపబ్లిక్' చిత్రంలో ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్ గా నటించగా, రమ్యకృష్ణ, జగపతిబాబు కీలకపాత్రలు పోషించారు.