బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2019 (16:22 IST)

కేసీఆర్ బ‌యోపిక్ టైటిల్ లోగోను విడుద‌ల చేసిన వ‌ర్మ‌

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం బయోపిక్‌ల బాటలో పయనిస్తున్నాడు. ఇటీవల ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్మతి ప్రవేశానంతరం చోటుచేసుకున్న పరిణామాల ఆధారంగా "ల‌క్ష్మీస్ ఎన్టీఆర్" అనే చిత్రాన్ని తెర‌కెక్కించి మంచి విజ‌యం సాధించాడు. 
 
తాజాగా వర్మ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్య‌మాన్ని ఎలా న‌డిపించారు అన్న నేప‌థ్యంలో సినిమాని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు స‌మాచారం. తాజాగా చిత్ర టైటిల్ లోగో విడుద‌ల చేశారు. 
 
'టైగర్ కేసీఆర్‌‌' అనే సినిమా టైటిల్‌ను ఫిక్స్‌ చేస్తూ.. ది అగ్రెసివ్‌ గాంధీ.. ఆడు తెలంగాణ తెస్తానంటే అందరూ నవ్విండ్రూ’ అని క్యాప్షన్‌గా పెట్టారు. ఇది కేటీఆర్ తండ్రి బ‌యోపిక్ అని చెబుతూ ఆంధ్ర పాల‌కుల రాజ్యంలో తెలంగాణ వాసులు ప‌డుతున్న ఇబ్బందుల‌ను చూసి త‌ట్టుకోలేక కేసీఆర్ ఏమి చేసారన్న అంశాన్నే తన సినిమాల్లో చూపిస్తానని వర్మ అన్నారు. 
 
ప్ర‌స్తుతం ఆయ‌న ‘కోబ్రా’ చిత్రంలో న‌టిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంతో వర్మ తొలిసారి న‌టుడిగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. జ‌య‌ల‌లిత‌, శ‌శిక‌ళ జీవిత నేప‌థ్యంలోనూ సినిమా చేస్తాన‌ని వ‌ర్మ గ‌తంలో ప్ర‌క‌టించిన సంగతి విదిత‌మే.