గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2019 (09:40 IST)

వైకాపాలో చేరిన చంద్రబాబు... వర్మపై పోలీసులకు ఫిర్యాదు

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకున్నారు. చంద్రబాబు టీడీపీని వీడి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపాలో చేరినట్టు ఓ ట్వీట్ చేశారు. దీనికి మార్ఫింగ్ చేసిన ఓ ఫోటోను కూడా పోస్ట్ చేశారు. ఈ ఫోటో వైరల్ కావడంతో వర్మ చిక్కుల్లో పడ్డారు. 
 
ఈ ఫోటోపై టీడీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబును అవమానించేలా సోషల్ మీడియాలో వర్మ పెట్టిన పోస్టింగ్‌‌లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ కార్యకర్తలు హైదరాబాద్‌‌లోని బాచుపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన ఫేస్‌‌బుక్‌, ట్విటర్‌ ఖాతాల్లో సీఎంను అవమానపరిచేలా మార్ఫింగ్‌ ఫోటోలను పెట్టారంటూ, ఇదే ప్రాంతానికి చెందిన దేవి వీర వెంకట సత్యనారాయణ చౌదరి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఫిర్యాదును స్వీకరించి విచారణ జరుపుతున్నారు.