ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2019 (12:26 IST)

రాంగోపాల్ వర్మ మూడో అవతారం... హీరో...

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఈయన దర్శకుడుగా, నిర్మాతగా రాణించారు. అంతేనా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా, సింగర్‌గా కూడా తనలోని ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇపుడు మూడో అవతారం ఎత్తనున్నాడు. ఇకపై ఆయన వెండితెరపై హీరోగా కనిపించనున్నాడు. 
 
ఇప్పటివరకు వెనుక కనిపించిన వర్మ.. ఇకపై తొలిసారి ముఖానికి మేకప్ వేసుకోనున్నాడు. గన్‌షాట్ ఫిలింస్ అనే సంస్థ తొలి ప్రయత్నంగా 'కోబ్రా' అనే పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనుంది. ఈ సినిమా ద్వారా వర్మ నటుడిగా వెండితెరకు పరిచయం కానున్నాడు. అయితే, ఈ చిత్రానికి వర్మనే దర్శకత్వం వహిస్తారా? లేదా మరొకరు దర్శకత్వం వహిస్తారా? అనేది తేలాల్సివుంది. 
 
అయితే, రాంగోపాల్ వర్మ హీరోగా నటించనున్నారనే విషయాన్ని ఆయన పుట్టిన రోజైన ఏప్రిల్ 7వ తేదీ ఆదివారం స్వయంగా ఆ చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ వార్త వర్మ అభిమానుల్లో సరికొత్త ఆసక్తిని నింపింది. దర్శకుడుగా ఇరగదీసిన వర్మ.. హీరోగా అదిరిపోయే ప్రతిభ కనపరచాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.