ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 7 ఏప్రియల్ 2019 (16:57 IST)

సైనా పాత్రకు పూర్తి న్యాయం చేసేలా కష్టపడతాను : పరిణీతి చోప్రా

అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్. ఈమె జీవిత చరిత్ర ఆధారంగా వెండితెర దృశ్యకావ్యం తెరకెక్కనుంది. అమోల్ గుప్తే తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్‌ని ముందుగా టైటిల్ రోల్‌కి ఎంపిక చేసారు. సైనా పాత్ర కోసం శ్ర‌ద్ధా క‌పూర్ కొన్ని నెల‌ల పాటు శిక్షణ కూడా పొందింది. 
 
అయితే, ఈమెకు ఉన్నట్టుండి డెంగీ జ్వరం రావడంతో ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీనికి తోడు వరుస ప్రాజెక్టులు ఉండటంతో సైనా బయోపిక్‌కు పూర్తిస్థాయిలో సమయం కేటాయించలేక పోయింది. దీంతో ఆమె స్థానంలో ప‌రిణితీ చోప్రాని ఎంపిక చేశారు. దీంతో ఆమె ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. 
 
"ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి రెండు గంటలు వర్కౌట్‌ చేస్తుందట. అంతేకాదు సైనా ఆడిన మ్యాచ్‌లను కూడా చూస్తుందట. సైనా పాత్రకు పూర్తి న్యాయం చేసేలా కష్టపడతాను" అని పరిణీతీ చోప్రా వెల్లడించారు. ఈ యేడాది చివ‌రిలో చిత్ర షూటింగ్ పూర్తి చేసి, 2020లో సినిమా రిలీజ్ చేయ‌నున్నారు. కాగా, సైనా కామ‌న్వెల్త్ గేమ్స్‌లో రెండు బంగారు ప‌తకాలు సాధించిన తొలి భార‌తీయ బ్యాడ్మింట‌న్‌ క్రీడాకారిణిగా నిలిచిన సంగ‌తి తెలిసిందే.