శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (13:45 IST)

100% నేను చేసింది క్షమించరాని తప్పు... క్షమించండి అరవింద్, పవన్ గారూ... RGV

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని శ్రీరెడ్డితో తిట్టించింది నేనే అంటూ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ఇండ‌స్ట్రీలో వాళ్లనే కాదు అంద‌రికీ షాక్ ఇచ్చాడు. దీంతో మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ ప్రెస్ మీట్ పెట్టి వ‌ర్మపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఇండ‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని శ్రీరెడ్డితో తిట్టించింది నేనే అంటూ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ఇండ‌స్ట్రీలో వాళ్లనే కాదు అంద‌రికీ షాక్ ఇచ్చాడు. దీంతో మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ ప్రెస్ మీట్ పెట్టి వ‌ర్మపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఇండ‌స్ట్రీ పెద్ద‌లు వ‌ర్మకి ఎలాంటి శిక్ష విధిస్తారో చెప్పాలంటూ డిమాండ్ చేసారు. అంతేకాకుండా అల్లు అర‌వింద్ వ‌ర్మపై ప‌లు ప్ర‌శ్న‌ల‌ను సంధించాడు. ఈ ప్ర‌శ్న‌ల‌కు వ‌ర్మ త‌న‌దైన శైలిలో ఫేస్‌బుక్ ద్వారా స‌మాధానం ఇచ్చాడు. 
 
వ‌ర్మ పోస్ట్ చేసిన ఫేస్‌బుక్‌ పోస్ట్‌ యథాతథంగా....
 
గౌరవనీయులైన అల్లు అరవింద్ గారి కామెంట్స్‌కి నా సమాధానం. 
 
 
అరవింద్ గారి కామెంట్: ఒక మనిషికి కొన్ని రోల్స్ ఉంటాయి.. ఇండస్ట్రీలో సీనియర్‌గా నాకు గౌరవం ఉంది.
RGV: ఎవరు కాదన్నారు? ఎవరు లేదన్నారు?
 
 
అరవింద్ గారి కామెంట్: శ్రీ రెడ్డి వ్యవహారంపై చాలాసార్లు ఛాంబర్‌లో చర్చించాం. రెండు మీటింగ్స్‌లో పాల్గొన్నా
RGV: అది బహిరంగంగా చర్చించాల్సిన విషయం.. పవన్ విషయానికి ఇంత ఫాస్టుగా వచ్చారు కానీ ఆ  విషయంలో ఇండస్ట్రీకి అంత పెద్ద సీనియర్‌గా నెల రోజులుగా ఒక చిన్న కామెంట్ కూడా చెయ్యలేదు మీరు.
 
 
అరవింద్ గారి కామెంట్: అంతర్గతంగా ప్రభుత్వం నిబంధనలతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి.. సినీ పరిశ్రమలో మహిళపై లైంగికంగా వేధిస్తే కమిటీ ద్వారా విచారణ చర్యలు తీసుకుంటాం.
RGV: అదేకదా నేను 20 రోజుల నుంచీ నెత్తీనోరు బాదుకుంటూ అరుస్తున్నది. 
 
 
అరవింద్ గారి  కామెంట్: ఇండస్ట్రీ తీసుకుంటున్న కమిటీలో నేను మెంబర్‌గా ఉంటున్నా.
RGV: గ్రేట్..
 
 
అరవింద్ గారి కామెంట్: ఇండస్ట్రీకి RGV చాలా ద్రోహం చేస్తున్నాడు.
RGV: పవన్ కళ్యాణ్ లాంటి లక్షలమంది ఫ్యాన్స్ వున్న తనని అలాంటి మాట అనిపించి నాకు నేను ద్రోహం చేసుకుంటున్నాను కాని ఇండస్ట్రీకి ఎలా ద్రోహం చేస్తున్నాను?
 
 
అరవింద్ గారి కామెంట్: నిన్న RGVకి చెందిన వీడియో చూశాను. శ్రీ రెడ్డి పవన్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యల వెనక రామ్ గోపాల్ వర్మ ఉన్నాడన్నది స్పష్టం అయ్యింది. 
RGV: వీడియోలో ఆ తప్పు చేసింది నేనేనని చెప్పింది నేనే కదా.. ఇంకా అందులో స్పష్టమవడానికి ఏముంది?
 
 
అరవింద్ గారి కామెంట్: 5 కోట్లు శ్రీరెడ్డికి ఆఫర్ చేసిన సొమ్ము ఎక్కడిది..? అతని ఆర్థిక స్థోమత ఏంటో తెల్సు.
RGV: దీనితో మీరు వీడియో చూడలేదని తెలుస్తోంది.. సురేష్‌తో మాట్లాడి అభిరామ్ విషయంలో ఇప్పించటానికి ట్రై చేస్తానని చెప్పాను... అంతేకానీ పవన్‌కి ఆ 5 కోట్లకి సంబంధం లేదు.. కనీసం ఇప్పుడైనా ఆ వీడియో చూడండి.
 
 
అరవింద్ గారి కామెంట్: పవన్, ఫాన్స్ పైన ఉన్న కోపంతో శ్రీ రెడ్డిని పావులు చేసి ఆడిస్తున్నావ్.
RGV: సార్ అరవింద్ గారు, పవన్ ఫ్యాన్స్ ప్రేక్షకులు, పైగా కోట్లమంది.. ఏ ఫిలిం మేకర్ అయినా ప్రేక్షకులతో కోపం కానీ కక్ష కానీ పెట్టుకుంటాడా?
 
అరవింద్ గారి కామెంట్: నీ అమ్మ, చెల్లిని నీ ముందు ఉంచి నాలుగు అక్షరాల ఇంగ్లీష్ బూతు పదం అంటే ఎలా ఉంటుంది.! కానీ మా నైతికత అది కాదు.
RGV: నా నైతికత కూడా అది కాదండీ. నేనెప్పుడూ బూతు పదాలు వాడను.. కావాలంటే మీరెవరినైనా అడగచ్చు.. కానీ అక్కడి సందర్భం నేను వీడియోలో వివరించాను.
 
 
అరవింద్ గారి కామెంట్: ఇండస్ట్రీలో తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన ఘనత RGVది.
RGV: ఇండస్ట్రీ మీరా? పవన్ కళ్యాణా? మీరు నాకు బ్రేక్ ఇచ్చారా? తల్లి పాలేంటి? నేను పవన్‌ని అలా అని నా రొమ్ము నేను గుద్దుకున్నాను కానీ ఇంకెవరి రొమ్ము గుద్దలేదు.
 
 
అరవింద్ గారి కామెంట్: పవన్ స్థాయి తగ్గించడానికి నువ్వు చేస్తున్న పథకం వెనక ఎవరున్నారు...?
RGV: పవన్ ఒక ఆకాశమంత ఎత్తున్న సూపర్ స్టార్ లీడర్.. అతని స్థాయి తగ్గించడానిక ఆఫ్ట్రాల్ నేనెవరిని? మీరు నమ్మినా నమ్మకపోయినా కేవలం నా స్వభావం తప్ప నా వెనుక ఎవరూ కానీ, ఏ పార్టీకానీ లేదు.. గత పదేళ్లుగా ఇన్సిడెంట్ల గురించి దేవుళ్ళ గురించి, సెలెబ్రిటీల మీద, గవర్నమెంట్ గురించి నేనెప్పుడూ ఏదో అంటూనే వచ్చాను.
 
 
అరవింద్ గారి కామెంట్: రాంగోపాల్ వర్మ నీచుడు.. తాను చేసినదానికి  చాలా డిప్రెషన్‌లో ఉన్నాడు.
RGV: అరవింద్ గారు మీమీద నాకు చాలా గౌరవముంది.. ఎప్పటికీ ఉంటుంది.. 100% నేను చేసింది క్షమించరాని తప్పు.. మళ్ళీ ఇంకొకసారి మీకు, పవన్ కళ్యాణ్‌కి మీ కుటుంబ సభ్యులకీ ఫ్యాన్స్‌కీ అందరికీ క్షమాపణ చెప్పుకుంటున్నాను. అంతేకాకుండా మళ్ళీ ఎప్పుడూ పవన్ మీద కానీ, మీ మిగతా ఫ్యామిలీ మెంబెర్స్ మీద కానీ నెగటివ్ కామెంట్స్ పెట్టనని మా మదర్ మీద, నా వృత్తి మీద ఒట్టేసి చెబుతున్నాను. గతంలో నా ఒట్లు నేను నిలబెట్టుకోకపోయుండచ్చు కానీ మా మదర్ మీద నేనెప్పుడూ ఒట్టేయ్యలేదు.