ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Mohan
Last Modified: మంగళవారం, 9 జనవరి 2018 (12:48 IST)

వర్మా.. ఖర్మఖర్మ.. పబ్లిసిటీ కోసం ఆడవారి సమస్యను కూడా వదలట్లేదు..

ఎప్పుడూ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రామ్‌గోపాల్‌ వర్మ మరోసారి ట్విట్టర్‌ వేదికగా, సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, ప్రియాంక చోప్రా నటించిన తాజా చిత్రమైన 'పద్మావత్' గురించి ట్వీట్ చేసాడు. గత ఏడాది డిసెంబర్‌లోనే ప్రే

ఎప్పుడూ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రామ్‌గోపాల్‌ వర్మ మరోసారి ట్విట్టర్‌ వేదికగా, సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, ప్రియాంక చోప్రా నటించిన తాజా చిత్రమైన 'పద్మావత్' గురించి ట్వీట్ చేసాడు. గత ఏడాది డిసెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం టైటిల్ విషయంలో వివాదం తలెత్తింది. అందువలన దర్శకనిర్మాతలు దీన్ని పద్మావత్‌గా మార్చారు. ఇది ఒక చారిత్రాత్మక చిత్రంగా తెరకెక్కెంది. 
 
ఈ చిత్రాన్ని గురించి తన ట్విట్టర్‌లో పేర్కొంటూ "ఒక చారిత్రాత్మక నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం మరియు స్త్రీల రుతుక్రమాన్ని ప్రధానాంశంగా చేసుకుని అక్షయ్ కుమార్ నటించిన ప్యాడ్‌మేన్ చిత్రం ఒకే రోజు రిలీజ్ కావడమే నిజమైన గణతంత్ర దినం" అని ట్వీట్ చేసాడు. అంతేకాకుండా "ఈ చిత్రం రుతుక్రమాన్ని గురించిన గొప్ప చారిత్రాత్మక కథ" అని కూడా ట్వీట్ చేసాడు. 
 
అంటే ఈ చిత్రం రిలీజ్ విషయంలో నెలకొన్న పరిస్థితులను సైతం పబ్లిసిటీ కోసం ఇలా స్త్రీలకు సంబంధించిన అంశాలను వాడేస్తున్నాడు వర్మ. పద్మావత్ మరియు ప్యాడ్‌మేన్ చిత్రాలు రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25వ తేదీన రిలీజ్ కానున్నాయి. ఈ రెండు చిత్రాలకు వర్మ చేసిన ట్వీట్ ఎంతమేరకు ఉపయోగపడుతుందో మరికొన్ని రోజుల్లో తేలనుంది.