సోమవారం, 13 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 జులై 2023 (14:24 IST)

రోజా, రమ్య కృష్ణన్ కలిశారు.. ఫోటోలు వైరల్

Roja_Ramya Krishnan
Roja_Ramya Krishnan
రోజా, రమ్య కృష్ణన్ 90వ దశకంలో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటీమణులు. వీరి సినిమాలు విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. దీంతో వీరిద్దరూ అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. వీరిద్దరూ సినిమాలకు అతీతంగా మంచి స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. 
 
ఈ సందర్భంలో నటి రమ్యకృష్ణ, రోజా చాలా గ్యాప్ తర్వాత కలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను రోజా తన సోషల్ మీడియా పేజీలో షేర్ చేసింది. రమ్యకృష్ణన్ మంచి స్నేహితురాలు అంటూ రోజా తెలిపింది. ఈ ఫోటోలు, వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.