శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2019 (13:16 IST)

ఇస్మార్ట్ శంకర్ తర్వాత ''రొమాంటిక్'' చాలా ఘాటు అంటోన్న పూరీ

సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు పూరీ జగన్నాథ్ కొత్త సినిమాకు రంగం సిద్ధం చేశారు. ఇస్మార్ట్ శంకర్‌తో చాలాకాలం తర్వాత తన కుమారుడు ఆకాశ్‌తో 'రొమాంటిక్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆకాశ్‌కు జోడీగా కేతికా శర్మ ఈ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను పూరీ జగన్నాథ్ విడుదల చేశారు. పేరుకు తగినట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా రొమాంటిక్‌గా వుంది. 
 
యూత్‌కు ఇది బాగా కనెక్ట్ అవుతుందని పోస్టర్‌ను చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. 'రొమాన్స్ అనేది ఎప్పటికీ చాలా ఘాటుగా ఉంటుంది' అంటూ ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ పాడూరి తెరకెక్కిస్తుండగా... పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
 
ఇక ముంబై భామ కేతికా శర్మ పూర్తిగా అందాల ఆరబోతకు రెడీ అంటుంది. ఇప్పుడు విడుదలైన ఫస్ట్ లుక్‌లో ఏకంగా బ్యాక్ లెస్ పోజ్ ఇచ్చి పిచ్చెక్కించింది. ఇదే ఏడాది సినిమా విడుదల కానుంది.