గురువారం, 6 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : బుధవారం, 5 మార్చి 2025 (19:48 IST)

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

Vijay Deverakonda at kingdom set
Vijay Deverakonda at kingdom set
ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో నితిన్ తో ఎల్లమ్మ చిత్రం గతంలో ప్రకటించారు. కాని కొన్ని కారణాల వాళ్ళ ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. కాని నేడు దానికి నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉందని ప్రకటించాడు. అదే విధం గా విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన సినిమా ఉందని తెలిపారు.
 
విజయ్ దేవరకొండ హీరోగా 12వ చిత్రం దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేస్తున్నారు. దేనికి సంభందించిన షూటింగ్ హైదరాబాద్ లో జర్గుతుంది. యాక్షన్ పార్ట్ చిత్రించారు. కింగ్ డం అనే పేరు పెట్టారు. ఈ సినిమా అనంతరం దర్శకుడు రవి కిరణ్ కోలతో నిర్మాత దిల్ రాజు తెస్తున్నారు.
 
“కింగ్ డమ్” చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య భారీ పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మే 30న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.