ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 23 మార్చి 2018 (10:50 IST)

''ఆర్‌ఆర్‌ఆర్'' అంటే ఏమిటి రామ్‌చరణ్? ఉపాసన ప్రశ్న రామ్‌చరణ్, రాజమౌళి, రామారావు? (video)

బాహుబలి తర్వాత జక్కన్న రాజమౌళి రూపొందిస్తున్న మల్టీ స్టారర్ మూవీ రంగం సిద్ధమవుతోంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంద

బాహుబలి తర్వాత జక్కన్న రాజమౌళి రూపొందిస్తున్న మల్టీ స్టారర్ మూవీ రంగం సిద్ధమవుతోంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన  స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. తాజాగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ శుక్రవారం ఆర్ఆర్ఆర్ ప్రకటన పేరిట 23 సెకన్లు ఉన్న ఓ వీడియో విడుదల చేసింది. 
 
బాహుబలి తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా తీయనున్నారనే విషయం ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. ట్రిపుల్ ఆర్‌లు చూపిస్తూ.. విడుదలైన ఈ వీడియోను రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్విట్టర్లో పోస్టు చేశారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ తన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ఆర్ (రాజమౌళి, రామ్‌చరణ్, రామారావు) అంటూ వీడియో విడుదలైంది. 
 
ఈ వీడియోపై స్పందించిన చెర్రీ వైఫ్ ఉపాసన.. తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసి.. ఇదేంటి రామ్ చరణ్ అంటూ ప్రశ్నించింది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.