సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (11:18 IST)

పైలెట్ యూనిఫాంలో డైనమిక్ గా కనిపించింది రుహాని శర్మ

Ruhani Sharma
వరుణ్ తేజ్ మేడిన్ బాలీవుడ్ ప్రాజెక్ట్ 'ఆపరేషన్ వాలెంటైన్' ఎడ్జ్ ఆఫ్ ది సీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రామిస్ చేసిన గ్రిప్పింగ్ టీజర్, వందేమాతరం, గగనాల చార్ట్ బస్టర్ సాంగ్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఐఏఎఫ్ ఆఫీసర్‌గా నటిస్తుండగా, మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా కనిపించనుంది.  
 
ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ రుహాని శర్మ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా మేకర్స్ రుహాని శర్మను తాన్య శర్మగా పరిచయం చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఎయిర్ ఫోర్స్ పైలెట్ యూనిఫాంలో డైనమిక్ గా కనిపించింది రుహాని శర్మ.
 
'ఆపరేషన్ వాలెంటైన్' చిత్రం దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరగని  పోరాటాన్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొనే సవాళ్లను అద్భుతంగా చూపించబోతుంది.
 
ఆపరేషన్ వాలెంటైన్’ కు శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించారు, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలు.
 
ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.