సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 జనవరి 2024 (15:11 IST)

మెగా కండిషన్స్ లేవ్.. భర్తగా వరుణ్ చాలా విషయాల్లో బెస్ట్.. లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi
టాలీవుడ్‌లో పెళ్లికి తర్వాత హోమ్లీ రోల్స్ ఎంచుకుంటారు. ఇంకా లేడి ఓరియెంటెడ్ రోల్స్ ఎంచుకుంటారు. లావణ్య త్రిపాఠి తన పెళ్లి తర్వాత ఈ ట్రెండ్‌ను ధిక్కరించింది. "మిస్ పర్ఫెక్ట్" కోసం ప్రమోషనల్ ప్రెస్ మీట్ సందర్భంగా లావణ్య తన పాత్రల ఎంపికకు సంబంధించి మెగా కుటుంబం పెట్టిన షరతుల గురించి చెప్పుకొచ్చింది. 
 
దీనిపై లావణ్య స్పందిస్తూ.. పెళ్లికి ముందు కానీ, తర్వాత కానీ తనకు ఎవరూ షరతులు విధించలేదని స్పష్టం చేసింది. మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు, ఆందోళనలు లేకుండా తన నటనా జీవితాన్ని కొనసాగించే స్వేచ్ఛను తాను ఆస్వాదిస్తున్నానని ఆమె నొక్కి చెప్పింది. 
 
తనకు ఎలాంటి షరతులు లేవని చెబుతూనే, మెగా ఫ్యామిలీలో కోడలుగా తన పరిమితులను అర్థం చేసుకున్నట్లు లావణ్య పేర్కొంది. మెగా ఫ్యామిలీతో ఏర్పడిన అనుబంధం "మెగా కోడలు" అని పిలిపించుకోవడం గొప్పగా వుందని చెప్పింది. 
 
లావణ్య త్రిపాఠి తన భర్త, వరుణ్ తేజ్‌ను సపోర్ట్ చేస్తూ, భర్తగా చాలా విషయాల్లో బెస్ట్ అని కొనియాడింది. ప్రస్తుతం ఆమె మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్‌తో బిజీగా ఉంది.