మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 19 ఆగస్టు 2019 (16:11 IST)

ప్రభాస్ ఒడిలో కూర్చుని చేతిలో గన్ పట్టుకొని శ్రద్ధాదాస్ ఏం చేస్తోంది..?

బాహుబలికి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సినిమా ''సాహో''. ఈ సినిమా ఆగస్టు 30వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.


తాజాగా విడుదలైన మరో పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. హీరోయిన్ శ్రద్ధా కపూర్‌తో కథానాయకుడు ప్రభాస్ ఇంటెన్స్ లవ్‌ని చూపిస్తున్న పోస్టర్ అదిరిపోతోంది. 
 
ప్రభాస్ ఒడిలో కూర్చుని శ్రద్ధాదాస్ చేతిలో గన్ పట్టుకొని కళ్ళల్లో ఏదో తెలియని భావాన్ని చూపిస్తోంది. సినిమా చూస్తే ఆమె కళ్ళ వెనక ఉన్న అసలు భావం ఏమిటో తెలుస్తుంది.

సినిమాపై ఆసక్తిని మరింత పెంచేలా ఈ పోస్టర్ వుంది. కాగా, సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.