గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 జూన్ 2020 (14:48 IST)

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తట్టుకోలేక వీరాభిమాని ఆత్మహత్య

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణం ఎందరినో తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎప్పుడు నవ్వుతూ ఉండే సుశాంత్ ఇలా హఠాన్మరణం చెందడంతో తట్టుకోలేకపోయిన ఆయన వదిన నిద్రాహారాలు మానడంతో అనారోగ్యానికి గురై కన్నుమూశారు. తాజాగా తన అభిమాన హీరో ఆత్మహత్య చేసుకున్నందుకు ఎంతగానో కలత చెందిన సుశాంత్ అభిమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలికి చెందిన వ్యక్తి సుశాంత్‌కి వీరాభిమాని. పదవ తరగతి చదువుతున్న ఆ వ్యక్తి సుశాంత్‌ని ఎంతగానో ఆరాధిస్తాడు. తన అభిమాన హీరో ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలుసుకున్న అభిమాని కూడా సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ లెటర్‌లో నా హీరో ఆత్మహత్య చేసుకోగా లేనిది నేను చేసుకోలేనా అంటూ రాసి ఉందని పోలీసులు పేర్కొన్నారు. 
 
మరోవైపు, సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్‌తో ముంబై పోలీసులు మాట్లాడారు. పలు విషయాలకు సంబంధించిన సమాచారాన్ని ఆయన నుంచి సేకరించే ప్రయత్నం చేశారు. ఈ సదంర్భంగా కేకే సింగ్ మాట్లాడుతూ, సుశాంత్ డిప్రెషన్‌తో బాధ పడుతున్నట్టు తనకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ తెలియదని చెప్పారు. తన కుమారుడు ఏ కారణంతో ఒత్తిడికి గురయ్యాడో తెలియదని చెప్పారు. సుశాంత్ మరణం విషయంలో తాము ఎవరినీ అనుమానించడం లేదని చెప్పారు.